Cinematograph Act: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రగడ.. అసలు యాక్ట్‌లో ఏముంది.. కేంద్రం ఏం తెస్తోంది. .?

కేంద్రంపై కత్తులు నూరుతోంది తమిళ ఇండస్ట్రీ. కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై 1952 యాక్ట్‌పై సవరణలు తీసుకురాబోతోంది. కొత్త సవరణల ప్రకారం కత్తెర పెత్తననం కేంద్రం దగ్గరే ఉంటుంది. దీనికి సంబంధించి ఓ ముసాయిదా బిల్లును కేంద్రం చక్కగా రెడీ చేసింది.ఇక్కడే ..

Cinematograph Act: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై రగడ.. అసలు యాక్ట్‌లో ఏముంది.. కేంద్రం ఏం తెస్తోంది. .?
Cinematograph Act
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 03, 2021 | 3:23 PM

కేంద్రంపై కత్తులు నూరుతోంది తమిళ ఇండస్ట్రీ. కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై 1952 యాక్ట్‌పై సవరణలు తీసుకురాబోతోంది. కొత్త సవరణల ప్రకారం కత్తెర పెత్తననం కేంద్రం దగ్గరే ఉంటుంది. దీనికి సంబంధించి ఓ ముసాయిదా బిల్లును కేంద్రం చక్కగా రెడీ చేసింది.ఇక్కడే ..ఇదే విషయంలో తమిళ నటులకు ఎక్కడో కాలుతోంది. కష్టం మాది..పెత్తనం మీదా ఒప్పుకునేదే లేదంటూ సూర్య ముందు గళం విప్పాడు. తర్వాత కమల్‌హాసన్, వెంటనే కార్తీక్ సుబ్బరాజు, గౌతమ్ మీనన్ స్వరం కలిపారు. కేంద్రం డెసిషన్‌పై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు.

సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీలో సవరణలు చేయాలని భావించిన కేంద్రం ఆ దిశగా సన్నాహలు మొదలుపెట్టింది. అవసరమైతే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పునఃపరిశీలన కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండేలా చట్ట సవరణ చేస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలపాలని 15 రోజులు గడువు కూడా ఇచ్చింది. ఆ గడువు జులై 2తో ముగిసింది. అప్పటి నుంచి యుద్ధం మొదలైంది. కేంద్ర నిర్ణయం పట్ల యావత్ సినీపరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయంటూ పౌరసమాజం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించే పనిలో పడింది కేంద్రం. దీంతో 1952నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రధానంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంపై దృష్టి సారించిన కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ.. 2013లో జస్టిస్ ముఖుల్ ముగ్దల్, 2016లో శ్యామ్ బెనగల్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సవరణల ప్రతిపాదనలపై జులై 2 వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్ 18న ప్రకటన జారీ చేసింది. చట్టంలో సవరించాలని భావిస్తున్న ప్రతిపాదనలు అందులో వివరించింది.

సినిమా ప్రదర్శనలకు జారీ చేసే U, A, S సర్టిఫికెట్లతోపాటు యూఏ సర్టిఫికెట్​కు అదనంగా మరిన్ని మార్పులను ప్రతిపాదించింది. యూఏ సర్టిఫికెట్ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు కూడా చూసేలా.. మూడు విభాగాలుగా విభజించింది. సర్టిఫికేషన్ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది.

అలాగే పైరసీ వల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో సినిమా పైరసీకి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి వరకు సరైన చట్టం లేదని గ్రహించింది. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్టంగా 3 నెలలు గరిష్టంగా 3 ఏళ్ల జైలుశిక్షతోపాటు 3 లక్షల జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం డబ్బును జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించింది. స్టార్​ నటుల అభ్యంతరం..సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో సినీ ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేశారని, ఇప్పుడు నేరుగా కేంద్రం జోక్యం చేసుకుంటానని చెప్పడం భావప్రకటన స్వేచ్చకు భంగం కలిగించడమేనని కమల్​హాసన్, సూర్య లాంటి నటులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాల్లో ఇదొకటని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ కోసం సినీపరిశ్రమ గళమెత్తాలని పిలుపునిచ్చారు.

అయితే కేంద్రం మాత్రం భావప్రకటన స్వేచ్ఛపై తన వాదనను మరోలా వినిపించింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో అధికారాలు ప్రస్తుత చట్టంలో సెక్షన్ 6లోనే ఉన్నాయని పేర్కొంది. 2000 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒకసారి సినిమా సర్టిఫికెట్ జారీ చేశాక ఆ తర్వాత కేంద్రం జోక్యం వద్దని ఉత్తర్వులు పేర్కొంది. కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదే సందర్భంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే దానికి తగిన చట్టాలు ఉండాలని అభిప్రాయపడింది. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీయడంతోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సినిమాలు ఉంటున్నాయంటూ తరచూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయి.

దేశసార్వభౌమత్వం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అంతర్గత భద్రత విషయంలో భావప్రకటన స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు ఉండొచ్చునని రాజ్యాంగం కూడా స్పష్టం చేస్తోందని కేంద్రం చెబుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టం-2021 ముసాయిదా బిల్లుపై అభిప్రాయలకు నిన్నటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తమ దృష్టికి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించి ఈ వర్షాకాల సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టం-2021ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు – 2021 ను నటుడు కమల్ హాసన్ తో సహా వెట్రిమారన్- ఆనంద్ పట్వర్ధన్ వంటి పలువురు చిత్రనిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “సినిమా- మీడియా- అక్షరాస్యత ఇవి మూడు భారతదేశంలోని దిగ్గజ కోతులుగా ఉండలేవన్నారు కమల్‌హాసన్‌. భవిష్యత్ లో చెడును చూడటం, వినడం, మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని గాయపరిచే, బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉన్న ఒకే మందు” అని.. స్వేచ్ఛ కోసం ఇతరులు ఆందోళన చెందాలని ట్విట్టర్‌లో వెల్లడించారు.

అసలు ఏంటీ సినిమాటోగ్రఫీ సవరణ చట్టం.. ఈ చట్టం ఏం చెబుతోంది.. పాత చట్టానికి ఈ సవరణ చట్టానికి తేడాలు ఏంటి? బిల్లుపై ప్రముఖుల అభ్యంతరాలేంటి? లా ఏం చెబుతోంది? నేషనల్‌ ఫిల్మ్‌ సర్డిఫికెట్‌ అప్పిలేట్‌ (NCAT ) ఏం చెప్పింది? తాజా బిల్లు ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇప్పటికే సెన్సార్ క్లియర్ చేసిన సినిమాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించి ఏవైనా తప్పులుంటే సరిదిద్దవచ్చు. జూన్ 18 న సినిమాటోగ్రాఫీ సవరణ బిల్లు – 2021 పై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరింది. ఇది 1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరించే ప్రయత్నం. జూలై 2వ తేది వరకు ప్రజలు తమ అభిప్రాయాలను పంపవచ్చు. ఈ కొత్త బిల్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి అనుమతిస్తుంది. ఫిర్యాదుల విషయంలో ఇప్పటికే సర్టిఫై చేయబడిన సినిమాలను మళ్లీ తిరిగి తీయాలని సూచిస్తుంది. ప్రభుత్వం పైరసీకి జరిమానా విధించవచ్చు. వయస్సు ఆధారిత సర్టిఫికేషన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందనే చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ సవరణ పై వెట్రీ మారన్- ఆనంద్ పట్వర్ధన్- కమల్ సహా పలువురు చిత్రనిర్మాతలు ఇంతకుముందు నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. CBFC ద్వారా సినిమాకు సంభందించిన చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. సినిమాను సర్టిఫై చేసేటప్పుడు అన్ని ప్రమాణాలను పాటించేలా చూసుకోవాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆసక్తిని కాపాడటానికి బోర్డు సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దీనికి తోడు సవరణను ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. సినిమా థియేటర్లలో నడుస్తున్న సినిమాలు సైతం తీసివేయబడతాయని కమల్ తెలిపారు.

థియేటర్లలో ఉన్న చిత్రాన్ని తీసివేస్తే అది నిర్మాతలకు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ భావజాలాన్ని దెబ్బతీసే విధంగా ఏ సినిమాను ప్రదర్శించలేమని తెలిపారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యాయ.. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్ లో ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను అకస్మాత్తుగా నిషేధించింది. ఇది దేశవ్యాప్తంగా చలన చిత్రనిర్మాతల నుండి విమర్శలకు కారణమైంది.

ఇవి కూడా చదవండి : Road accident On Camera: కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు.. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డు ప్రమాదం..

Spiders Smuggling: డ్రగ్స్, గోల్డ్‌, నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్.. కాదు ఇప్పుడు అమెరికన్ స్పైడర్స్.. ఉలిక్కిపడిన చెన్నై ఎయిర్ పోర్ట్‌ అధికారులు

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!