Malai Sandwich Recipe: పిల్లలు టిఫిన్ తినడానికి మారం చేస్తున్నారా.. క్రీమ్ శాండ్‌విచ్ ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం
అల్ఫహారంగా లేక మధ్యాహ్నం స్నాక్స్ గా ఇడ్లీ, దోశ వంటి వాటిని ఇంట్లో సభ్యులకు అందిస్తే అబ్బో రోజూ ఇదేనా బోర్ అంటూ తినడానికి అనాసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే తినడానికి మారం చేస్తారు. అదే సమయంలో శాండ్ విచ్, పిజ్జా , బర్గర్ వంటి డిఫరెంట్ ఫుడ్ ని పిల్లలు ఇష్టపడతారు. అయితే పిల్లలకు అల్పాహారంలో రుచికరమైన క్రీమ్ శాండ్‌విచ్ తయారు చేసుకోండి. చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు.

తరచుగా తమ పిల్లల తిండి విషయంలో తల్లులకు ఆందోళన కలుగుతుంది. ఏది చేస్తే వారు తింటారా అని ఆలోచిస్తారు. అంతేకాదు పిల్లలకు ఉదయాన్నే రుచికరమైన, ఆరోగ్యకరమైనది టిఫిన్ ను తయారు చేయడం గురించి మీరు ఆందోళన చెందుతారు కూడా.. ఎందుకంటే పిల్లలు పేచీ పెట్టకుండా సంతోషంగా తినాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే మీరు కూడా పిల్లలకు ఏమి చేయాలనీ ఆలోచిస్తుంటే.. ఈ రోజు మేము మీ కోసం ఒక రెసిపీని తీసుకువచ్చాము. అది మీ పిల్లలకు కొత్తగా ఉండడమే కాదు చాలా ఇష్టమైనదిగా మారుతుంది. ఈ రోజు మలై శాండ్‌విచ్ గురించి తెలుసుకుందాం..! దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని తయారు చేయడనికి తక్కువ పదార్ధాలు చాలు.. అదే సమయంలో ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఈ రోజు మలై శాండ్‌విచ్ రెసిపీ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్దాలు
- బ్రెడ్ ముక్కలు: 8-10 ( మిల్క్ బ్రెడ్ లేదా గోధుమ రొట్టె)
- తాజా క్రీమ్: 4-5 టేబుల్ స్పూన్లు (పాలు మరిగించిన తర్వాత వచ్చే మందపాటి క్రీమ్)
- ఉల్లిపాయ: 1 చిన్నది (తరిగిన ముక్కలు)
- క్యాప్సికమ్: 1 చిన్నది (సన్నగా తరిగిన ముక్కలు)
- టమోటా: 1 చిన్నది (సన్నగా తరిగిన ముక్కలు)
- పచ్చిమిర్చి: 1/2 (సన్నగా తరిగిన ముక్కలు )
- కొత్తిమీర: సన్నగా తరిగిన ఆకులు
- ఉప్పు: రుచికి సరిపడా
- మిరియాల పొడి: 1/4 టీస్పూన్
- టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీ: (వడ్డించడానికి)
క్రీమ్ శాండ్‌విచ్ తయారీ విధానం:
- ముందుగా ఒక పెద్ద గిన్నెలో తాజా క్రీమ్ తీసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటా, పచ్చిమిర్చి,, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
- ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్క తీసుకుని దానిపై తయారుచేసిన క్రీమ్ ఫిల్లింగ్ ను బాగా అప్లై చేయండి. మీకు నచ్చిన విధంగా మందపాటి లేదా సన్నని పొరగా ఈ క్రీమ్ ని బ్రెడ్ కి అప్లై చేయండి.
- తర్వాత ఫిల్లింగ్ నిండిన బ్రెడ్ పైన మరో బ్రెడ్ ముక్కను ఉంచి తేలికగా ప్రెస్ చేయండి.
- ఇష్టమైన వారు మీరు దీనిని ఇలాగే అంటే పచ్చిగా తినవచ్చు.
- లేదంటే ఇలా ఫిల్లింగ్ చేసిన బ్రెడ్ ను కాల్చవచ్చు.
- కొంచెం నెయ్యి లేదా వెన్న ఫిల్లింగ్ చేసిన బ్రెడ్ కి రెండు వైపులా రాసి బంగారు రంగులోకి వచ్చే వరకు పాన్ మీద కాల్చండి.
- తర్వాత వేడిగా లేదా చల్లని క్రీమ్ శాండ్‌విచ్‌ను టమోటా సాస్ లేదా మీకు ఇష్టమైన గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..