AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Health: తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారా.. ఈ వాస్తు నియమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి..

ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలంటే ఇంటిలో వాస్తు దోషాలు లేకుండా.. అంటే ఇంట్లో ప్రతి కూల శక్తి లేకుండా ఉండాలి. అయితే ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్న ఇంట్లో నివసించే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఈ రోజు ఆ 8 వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం.. .

Vastu Tips for Health: తరచుగా వ్యాధుల బారిన పడుతున్నారా.. ఈ వాస్తు నియమాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి..
Vastu Tips For Good Health
Surya Kala
|

Updated on: Jul 03, 2025 | 12:02 PM

Share

ఇంటి నిర్మాణం, దిశ, శక్తి మన ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి లేదా వాస్తు దోషం ఉంటే.. ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం, వీటిని పాటించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

నిద్ర దిశను సరిగ్గా ఉంచండి: వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి దక్షిణం లేదా తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి. ఉత్తరం వైపు తల పెట్టి నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. తరచుగా తలనొప్పి, అలసట లేదా నిద్రలేమి వస్తుంది. నిద్ర దిశను సరిగ్గా ఉంచుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మంచం కింద చెత్త లేదా బరువైన వస్తువులను ఉంచవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద స్థలం ఖాళీగా ఉండాలి. ఎవరైనా సరే మంచం కింద పాత బట్టలు, బూట్లు, పత్రాలు లేదా చెత్తను పెడితే అది ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి, అలసట, నిద్ర లేమికి కూడా కారణమవుతుంది. కనుక మంచం కింద స్థలాన్ని శుభ్రంగా ఉంచండి. అనవసరమైన వస్తువులను తొలగించండి.

ఇవి కూడా చదవండి

టాయిలెట్ స్థానం పట్ల శ్రద్ధ వహించండి: టాయిలెట్ ఈశాన్య దిశలో ఉంటే అది అతిపెద్ద వాస్తు లోపంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ఒత్తిడి, అనారోగ్యాలు, వ్యాధుల ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. ఈ పరిస్థితిలో, ప్రతి ఉదయం ఇంట్లో గంగా జలాన్ని చల్లి.. వాస్తు దోష నివారణ చర్యలు తీసుకోవాలి.

బెడ్ రూమ్ లో అద్దం పెట్టవద్దు: నిద్రపోతున్నప్పుడు అద్దం వ్యక్తి శరీరాన్ని ప్రతిబింబిస్తే.. అది మానసిక, శారీరక ఆరోగ్యానికి హానికరం. బెడ్ రూమ్ లో అడ్డం పెట్టవద్దు.. ఒకవేళ బెడ్ రూమ్ లో అద్దం ఉంటే.. పడుకునే ముందు దానిని ఒక గుడ్డతో కప్పాలి.

వంటగది, బాత్రూమ్ ఎదురెదురుగా ఉండవద్దు: వంటగది, బాత్రూమ్ ఒకదానికొకటి ఎదురుగా ఉంటే.. అది అగ్ని, నీటి మూలకాల ఘర్షణను సూచిస్తుంది. ఇది కుటుంబ సభ్యులలో అనారోగ్యానికి, ఒత్తిడికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో వంటగది ద్వారానికి ఎరుపు రంగు కర్టెన్ ను వేలాడదీయడం శుభప్రదం.

ఇంట్లోకి సూర్యకాంతి ప్రవేశించనివ్వండి: వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యకాంతి ఉదయం ఇంట్లోకి ప్రవేశించాలి. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. సూర్యకాంతి ఎముకలకు చాలా అవసరమైన విటమిన్ డి ని కూడా అందిస్తుంది.

ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచండి: ఇంటి ఈశాన్య మూలను దేవుని ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ ధూళి లేదా బరువైన వస్తువులను ఉంచడం వల్ల మానసిక అశాంతి, అలసట, వ్యాధులు పెరుగుతాయి. ఈ దిశను శుభ్రంగా, తేలికగా ఉంచడమే కాదు పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది.

వాటర్ ట్యాంక్ ను సరైన స్థలంలో ఉంచండి: ఇంట్లో వాటర్ ట్యాంక్ లేదా బోరింగ్ ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉండాలి. నీటి వనరులను తప్పుడు దిశలో ఉండటం వల్ల మానసిక ఒత్తిడితో పాటు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే వాస్తు దోష నివారణ యంత్రం లేదా వాస్తు సలహాదారుడి సహాయం తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.