Pomegranate Juice Benefits: డైటింగ్ చేసేవాళ్లు ఈ జ్యూస్ తాగితే చాలు.. బరువు తగ్గడం, ఆరోగ్యం రెండూ మీ సొంతం
బరువు తగ్గడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో? ఆహారం కూడా అంతే అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు దానిమ్మ జ్యూస్ ను సేవిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం అంతా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది వ్యాయామాలు, వాకింగ్ వంటి వాటిని ఆశ్రయిస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో? ఆహారం కూడా అంతే అవసరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు దానిమ్మ జ్యూస్ ను సేవిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా దానిమ్మ గింజలు తిన్నా సరిపోతుందని, కానీ అదనపు ప్రయోజనాల కోసం కచ్చితంగా దానిమ్మ జ్యూస్ ను సేవించాలని పేర్కొంటున్నారు. దానిమ్మ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఓసారి తెలుసుకుందాం
మెరుగైన జీవక్రియ
దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, లినోలెనిక్ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మరింత వేగం చేయడానికి సాయం చేస్తాయి. అలాగే కొవ్వును బర్న్ చేయడానికి సూపర్ పవర్ లా పని చేస్తుంది.
ఆకలి సమస్య దూరం
బరువు తగ్గడంలో ఆకలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. బరువు పెరుగుతామేమో? అనే ఉద్దేశంతో తక్కువ తినాలనిపించినా అధిక ఆకలి కారణంగా ఎక్కువ తినేస్తుంటాం. ఇలాంటి సమయంలో దానిమ్మ జ్యూస్ ను సేవిస్తే ఆకలి సమస్య నుంచి బయటపడవచ్చు. దీని ద్వారా అధిక బరువు సమస్య దూరం అవుతుంది.
తక్కువ క్యాలరీలు
దానిమ్మ జ్యూస్ లో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం 100 గ్రాముల దానిమ్మ గింజల్లో కేవలం 83 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఈ క్యాలరీలు కూడా కార్బోహైడ్రేట్ల నుంచి వస్తాయి. కాబట్టి ఈ రసం నుంచి పొందుతున్న తక్కువ క్యాలరీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
ఇతర పానియాలకు ప్రత్యామ్నాయం
దానిమ్మ సహజంగా తియ్యగా ఉంటుంది. కాబట్టి ప్యాక్ చేసిన జ్యూస్ లు, కోలాలు, సోడాల వంటి వాటికి ప్రత్యామ్నాయంగా దానిమ్మ జ్యూస్ ను తాగవచ్చు. 100 గ్రాముల దానిమ్మ పండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి ఇతర పానియాలకు ప్రత్యామ్నాయంగా దానిమ్మ జ్యూస్ ను తాగవచ్చు.
అధిక ఫైబర్
ఓ మీడియం సైజ్ దానిమ్మ పండులో 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సాయం చేస్తుంది. అలాగే అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి దివ్యఔషధంలా పని చేస్తుంది.
దానిమ్మ రసం ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి
చాలా మంది దానిమ్మ జ్యూస్ ను ఇష్టపడరు. అలాంటి వారు కొంచెం బీట్ ముక్కలను దానిమ్మ గింజలకు యాడ్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే దానిమ్మ ఫ్లేవర్ పోయి చాలా బాగుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓ స్పూన్ మిరయాల పొడి, కలబంద వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అవసరమైతే ఐస్ క్యూబ్స్ ను వాడిన పరవాలేదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం