AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ మంత్రం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి, తేనె కలిపి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కూడా వెల్లుల్లి-తేనె మిశ్రమం సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మార్నింగ్ మంత్రం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి, తేనె కలిపి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Garlic With Honey
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2026 | 8:40 PM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.. ముఖ్యంగా మంచి ఆహారం, సరైన జీవనశైలిని అనుసరించడం ద్వారా పలు సమస్యలను నివారించవచ్చు.. అయితే.. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల్లో వెల్లుల్లి, తేనె మిశ్రమం ఒకటి.. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది.. ఈ సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తూ, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉండి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

వెల్లుల్లి తేనెను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

వెల్లుల్లి తేనె – రెండింటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మానవ జీవితం ఒత్తిడితో కూడుకున్నది. ఎన్నో రకాల సమస్యలు, పని ఒత్తిళ్లు వల్ల త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం సర్వసాధారణం. ఇలా తరచుగా జరుగుతూ ఉంటే, మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతోందని అర్థం. ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన రోగనిరోధక వ్యవస్థ అత్యవసరం. అది బలహీనపడినప్పుడు రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజాగా చేసిన పరిశోధనల ప్రకారం, ప్రతి ఇంట్లోనూ సాధారణంగా దొరికే వెల్లుల్లి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల మనలోని రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా, రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులోకి రెండు టేబుల్‌స్పూన్ల తేనెను కలపాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకున్న వెంటనే, ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు తీసుకుంటే అమోఘమైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పరగడుపున తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా అరికడుతుంది. కరోనరీ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను కూడా ఈ మిశ్రమం తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఇది ధమనులలో పేరుకుపోయే అనవసర కొవ్వును తొలగించి, గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరిగేలా సహాయపడుతుంది.

అంతేకాకుండా, ఈ వెల్లుల్లి, తేనె మిశ్రమం గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇందులో సమృద్ధిగా లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి. ఈ శక్తివంతమైన పేస్ట్ డయేరియాను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా నయం చేసే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, సహజ కాలన్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి.

ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల జలుబు, సైనసైటిస్, ఫ్లూ వంటివి ప్రభావవంతంగా తొలగిపోతాయి. వెల్లుల్లి, తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియా అయినా నాశనం చేసే శక్తి దీనికి ఉంది. వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరం డీటాక్సిఫై అవుతుంది. అంటే శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపడమే కాకుండా, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించండి..

Follow Us