AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charmy Kaur : ఇండస్ట్రీలో ఆయనే నాకు గాడ్ ఫాదర్.. ఎన్నో విషయాలు నేర్పించారు.. హీరోయిన్ ఛార్మీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్లలో ఛార్మీ కౌర్ ఒకరు. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే నటిగా అందరి ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ప్లాప్స్ మూటగట్టుకుంది. దీంతో అనుహ్యంగా సినిమాలు వదిలేసి నిర్మాతగా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Charmy Kaur : ఇండస్ట్రీలో ఆయనే నాకు గాడ్ ఫాదర్.. ఎన్నో విషయాలు నేర్పించారు.. హీరోయిన్ ఛార్మీ..
Charmy
Rajitha Chanti
|

Updated on: May 18, 2026 | 8:07 PM

Share

హీరోయిన్ ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమాతో తెలుగు తెరపై గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్స్ చేసింది. ఆ తర్వాత సినిమాలు వదిలేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ పూరితో కలిసి నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఛార్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అందులో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ, ఆయనను తన గాడ్ ఫాదర్ అని అన్నారు. “ఒక గురువు కేవలం నేర్పిస్తాడు, అది నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం మన చేతుల్లో ఉంటుంది. కానీ ఒక గురువు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేస్తే, ఆ వ్యక్తే గాడ్ ఫాదర్ అవుతారు,” అని ఛార్మి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

వంశీ కేవలం సినిమా అవకాశాలు ఇవ్వడమే కాకుండా, తన నిజమైన స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరించారని తెలిపారు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దుస్తులు ధరించాలి వంటి విషయాల్లోనూ వంశీ తనకు సలహాలు ఇచ్చేవారని, ఆయన ఒక గార్డియన్ ఏంజిల్ లాంటి వారని చెప్పుకొచ్చారు. చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఛార్మి, కీర్తితో పాటు పుకార్లను కూడా ఎదుర్కొన్నారు. తనకు ఏమి తెలియకుండా అమాయకంగా ఉన్న సమయంలో తనపై వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడుతూ. “ప్రజలు నా గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. అది సానుకూలంగా కాకపోయినా, కనీసం ప్రతికూలంగా అయినా నన్ను వారి చర్చల్లో ఉంచాలని కోరుకుంటారు. నేను దాన్ని నేను ప్రసిద్ధి చెందాను, అందుకే ప్రజలు నా గురించి మాట్లాడుతున్నారు అని తీసుకుంటాను” అని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

విజయాలు, అపజయాలను ఎదుర్కొనే విధానం గురించి మాట్లాడుతూ, తన తండ్రి ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్నారు: “విజయాలు, అపజయాలు నిన్ను ప్రభావితం చేయకూడదు. నువ్వు నువ్వుగానే ఉండాలి.” ఈ సూత్రాన్ని తాను నమ్ముతానని, అయితే ఒక యువతిగా ఫ్లాప్స్ వచ్చినప్పుడు బాధపడటం, హిట్స్ వచ్చినప్పుడు కొత్త ఉత్సాహం రావడం సహజమేనని అంగీకరించారు. సినిమా రంగం ఒక పరీక్ష లాంటిదని, కానీ ఇక్కడ ఎంత కృషి చేసినా ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేమని ఛార్మి అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

Follow Us