EPFO: పీఎఫ్ ఉన్నవారికి త్వరలో కేంద్రం నుంచి శుభవార్త.. ఇక నుంచి నెలకు రూ.3 వేలు..
ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. కనీస పెన్షన్ పరిమితిని పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యి ఉండగా.. రూ.3 వేలకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. అయితే పెన్షన్ పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. త్వరలో ఈపీఎఫ్ఓ దేశంలోని లక్షలాది మంది పీఎఫ్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది. అదేంటంటే.. పీఎఫ్ కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచనుంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉండగా.. త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. త్వరలో రూ.3 వేలకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ రూ. వెయ్యిగా ఉంది. దీనిని రూ.3 వేలకు పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి.
కనీస పెన్షన్ పరిమితి పెంపు..?
ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, జీవన ప్రమాణాలు మారుతుండటం వల్ల కనీస పెన్షన్ పరిమితిని పెంచాలని ఎప్పటినుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఉద్యోగులు కూడా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. తమ ఖర్చులకు సరిపోవడం లేదని, పెంచాలని ఆందోళనలు కూడా చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వ స్పందించింది. పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. కనీస పెన్షన్ పెంచడం వల్ల తక్కువ జీతాలు పొందుతున్నవారికి, తక్కువకాలం పాటు ఈపీఎఫ్ఓకు చెల్లింపులు చేసిన పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
పింఛన్ పొందేందుకు షరతులు
అయితే ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ కండీషన్స్ ఏంటంటే.. ఉద్యోగికి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ రికార్డ్ ఉండాలి. అంటే 10 సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓలో జమ చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువ చెల్లింపులు చేస్తున్న ఉద్యోగులకు కనీస పెన్షన్ పరిమితి పెంచడం వల్ల పరిమిత ప్రయోజనాలు ఉంటాయి. అయితే తక్కువ పించన్ పొందుతున్నవారికి మాత్రం అత్యధిక ఉపశమనం లభిస్తుంది. 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్లు పీఎఫ్ కు కాంట్రిబ్యూషన్ చేసినవారికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. రూ. 3 వేలు పింఛనుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కార్మిక మంత్రిత్వ శాఖ, EPFO స్థాయిలలో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. లక్షలాది మంది EPS పింఛనుదారులు, ముఖ్యంగా పింఛనుయే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వృద్ధులు గణనీయమైన ఉపశమనం పొందవచ్చు.
