హైదరాబాద్ యువ వ్యాపారవేత్త నవాబ్ సయ్యద్ కుమైజ్ మొహియుద్దీన్ హుస్సేనీ తన ఫామ్ హౌస్లో కట్లపాముతో సరదాగా ఆడే ప్రయత్నంలో కాటుకు గురయ్యారు. పాము కాటును నిర్లక్ష్యం చేయడంతో గంటలోపే పరిస్థితి విషమించింది. స్నేహితులు ఎంత చెప్పినా వినకపోవడంతో, ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. జూన్ 18న జరిగిన ఈ ఘటనలో ఆయన మృతి చెందారు.