మామిడి పండు పోషకాల గని. ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే, పరగడుపున లేదా రాత్రి పూట మామిడి పండ్లు తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో వేడి చేసే గుణం ఉండడం వల్ల అసిడిటీ, చర్మ సమస్యలు రావొచ్చు. మధ్యాహ్నం పూట, నీటిలో నానబెట్టి తినడమే ఉత్తమం.