హనుమకొండ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఎస్బీహెచ్ కాలనీలో సుమలత అనే మహిళ మెడలో బంగారు పుస్తెల తాడును బైక్పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.