AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Krishnan: సినిమాలు మానేయడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ సత్య క్రిష్ణన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహయ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సత్య కృష్ణన్. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు అంతగా సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. అలాగే తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలు వెల్లడించింది.

Satya Krishnan: సినిమాలు మానేయడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ సత్య క్రిష్ణన్..
Satya Krishnan
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2026 | 9:32 PM

Share

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్స్ ‘ఆనంద్’, ‘డాలర్ డ్రీమ్స్’ మరియు భాస్కర్ తెరకెక్కించిన ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన నటి సత్య కృష్ణన్. ఆనంద్ సినిమాలో ఆమె చెప్పిన “నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు” అనే డైలాగ్ ఇప్పటికీ ఎంతో పాపులర్. అయితే మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, ఆమె గత కొంతకాలంగా సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సత్య కృష్ణన్.. తాను సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను , తన వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. తాను సినిమాలు పూర్తిగా మానేయలేదని, అయితే ఇండస్ట్రీలో ఒక లుక్ లేదా ఇమేజ్ వచ్చేసిన తర్వాత దర్శకులు స్టీరియోటైప్ (ఒకే రకమైన) పాత్రలకే పరిమితం చేస్తారని సత్య కృష్ణన్ పేర్కొన్నారు. బిగినింగ్ నుండి వదిన, అక్క, కామెడీ పాత్రల్లో తనను సెట్ చేసేశారని, వేరే డిఫరెంట్ పాత్రలతో రిస్క్ చేయడానికి చాలా మంది దర్శకులు ముందుకు రాలేదని ఆమె అన్నారు. నటిగా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

‘ఆనంద్’ సినిమా తర్వాత తనకు పాప పుట్టడంతో, బిడ్డను చూసుకోవడం కోసం ఒకట్రెండు సంవత్సరాలు సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత బెంగళూరు నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని మళ్లీ ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చానని చెప్పారు. బొమ్మరిల్లు తనకు మంచి పేరు తెచ్చినప్పటికీ, అంత పెద్ద హిట్ సినిమాలో తన క్యారెక్టర్ ఇంకొంచెం లెంత్ ఉండి, ఎలివేట్ అయి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

తాను హోటల్ మేనేజ్మెంట్ చదివి తాజ్ గ్రూప్‌లో ఫ్రంట్ ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు శేఖర్ కమ్ముల టీమ్ తనను చూసి ఆడిషన్‌కు పిలిచారని, అలా అనుకోకుండా నటినయ్యానని చెప్పారు. తనది తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తితో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని, వివాహమై 24 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. అత్తగారితో కలిసి జాయింట్ ఫ్యామిలీలో ఉండటం తనకు ఎంతో ఇష్టమని, బాధ్యతగా కుటుంబాన్ని ఎలా నడపాలో తన అత్తగారి దగ్గరే నేర్చుకున్నానని సత్య కృష్ణన్ ఈ ఇంటర్వ్యూలో సంతోషంగా పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us