Lemon Peel: జ్యూస్ తీశాక నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..
సాధారణంగా నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసిన తర్వాత వాటిని విసిరిపారేస్తుంటారు. తొక్కలను తినలేం.. జంతువులు కూడా నిమ్మ తొక్కను తినడానికి ఇష్టపడవు. ఐతే ఇలా నిమ్మకాయ తొక్కను వృధాగా పారేసేబదులు వాటితో రుచికరమైన ఊరగాయ పచ్చడి పెట్టుకోవచ్చనే..
సాధారణంగా నిమ్మకాయల నుంచి జ్యూస్ తీసిన తర్వాత వాటిని విసిరిపారేస్తుంటారు. తొక్కలను తినలేం.. జంతువులు కూడా నిమ్మ తొక్కను తినడానికి ఇష్టపడవు. ఐతే ఇలా నిమ్మకాయ తొక్కను వృధాగా పారేసేబదులు వాటితో రుచికరమైన ఊరగాయ పచ్చడి పెట్టుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. నిమ్మ తొక్కతో చేసిన ఊరగాయ రుచికి భేషుగ్గా ఉండటమేకాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయతొక్కల ఊరగాయ ఎలా చేస్తారంటే.. ముందుగా 300 గ్రాముల నిమ్మ తొక్కలను ఒక గిన్నెలో తీసుకుని నీళ్లలో శుభ్రంగా కడుగుకోవాలి. కడిగిన తర్వాత నిమ్మ తొక్కలను 2 నిముషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత బయటికి తీసి పొడవాటి ముక్కలుగా వీటిని తరుగుకోవాలి.
తరిగిన నిమ్మ తొక్క ముక్కల్లో అర టీస్పూన్ బ్లాక్ సాల్ట్, రుచికి తగ్గట్టుగా వైట్ సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ టీస్పూన్ కారం, టీస్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే స్పూన్ గరం మసాలా, స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత అరకప్పు నూనె పోసి మరోసారి బాగా కలపాలి. ఊరగాయ గిన్నెను ఓవెన్‌లో 10 నుంచి 15 నిముషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత బయటకు తీసి, చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సరి.. కొన్ని రోజులు నిల్వ ఉంచిన తరువాత రుచికరమైన ఊరగాయ రెడీ అవుతుంది. మీరూ ఓ సారి ట్రై చేయండి..
మరిన్న లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.