AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మిర్చి కొరికితే భరించలేని కారం.. కానీ నీళ్లు తాగకూడదట..! ఎందుకంటే..

Spicy Food: తరచుగా ప్రజలు మసాలా ఫుడ్‌ని తినడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో అనుకోకుండా పంటి కింద పచ్చి మిర్చిపడినప్పుడు వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.

Health: మిర్చి కొరికితే భరించలేని కారం.. కానీ నీళ్లు తాగకూడదట..! ఎందుకంటే..
Chilli
uppula Raju
|

Updated on: Sep 29, 2021 | 5:22 PM

Share

Spicy Food: తరచుగా ప్రజలు మసాలా ఫుడ్‌ని తినడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో అనుకోకుండా పంటి కింద పచ్చి మిర్చిపడినప్పుడు వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. నోరు మొత్తం మండిపోతుంది. కళ్ల నుంచి ముక్కు నుంచి నీరు బయటికి వస్తాయి. నోటి నుంచి వింత శబ్దాలు వినపడుతాయి. అప్పుడు వెంటనే చేతి నీటి గ్లాసు కోసం వెతుకుతుంది. వెంటనే రెండు మూడు గ్లాసుల నీరు తాగుతారు. అయినా కారం చల్లారదు. దీనికి కారణం ఆహారంలో మిర్చి ఎక్కువగా ఉండటం కాదు మీరు నీరు తాగడం. అవును మీరు నీరు తాగడం వల్లే మీ సమస్య మరింత పెరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

అమెరికన్ కెమికల్ సొసైటీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. మిరపకాయలో కెప్సైసిన్ (Capsaicin) అనే రసాయనం ఉంటుంది. నోరు మండటానికి కారణం ఇదే. కెప్సైసిన్ మానవ కణజాలంతో కలిసినప్పుడు బర్న్‌ అవుతుంది. దీంతో మంట మొదలవుతుంది.అప్పుడు మీ ముక్కు, కళ్ళ నుంచి నీరు రావడం మొదలవుతుంది. అంతేకాదు శరీరం నుంచి చెమట కూడా వస్తుంది. క్యాప్సైసిన్ ధ్రువ రహిత అణువులను కలిగి ఉంటుంది. ఇవి ధ్రువ రహిత అణువులను కలిగి ఉన్న పదార్థాల ద్వారా మాత్రమే నాశనమవుతాయి. కానీ నీటిలో ధ్రువ అణువులు ఉంటాయి. ఇవి క్యాప్సైసిన్‌పై ఎటువంటి ప్రభావం చూపదు. అంతేకాదు నీరు క్యాప్‌సైసిన్‌ని నోరు మొత్తం వ్యాపించేలా చేస్తుంది. దీంతో కారం, మంట మరింత పెరుగుతాయి.

కారంగా ఉన్నప్పుడు నీరు తాగడం అనేది నూనెతో కలిపిన నీరుగా భావిస్తారు. ఇది ఏమాత్రం సరైన పరిష్కారం కాదు. ఇది రసాయనాన్ని వ్యాప్తిని పెంచుతుంది. అందువల్ల మీరు కారంగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం మానుకోవాలి. ఆ సమయంలో మీరు పాల ఉత్పత్తులను తినాలి. ఇందులో అత్యంత ప్రభావవంతమైన పాలు ఉంటాయి. అంతేకాదు పాలలో ధ్రువ రహిత అణువులు ఉంటాయి. ఇవి క్యాప్‌సిసిన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మీకు కారం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా మీరు నీటికి బదులుగా వేరే ఏదైనా తిని ఆ తర్వాత నీరు తాగాలి.

Shark: వేటకు వెళ్లారు.. కానీ వారు ఊహించనిది జరిగింది.. ఇంతకీ ఏం జరిగింది?

చల్లటి నీటితో స్నానం చేస్తే 5 పెద్ద ప్రయోజనాలు..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

షాకింగ్‌.. ప్రతిరోజు మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలుసా..! ఆశ్చర్యపోతారు..