AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లటి నీటితో స్నానం చేస్తే 5 పెద్ద ప్రయోజనాలు..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bathing In Cold Water: చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కానీ కొంతమంది సులువుగా చేస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఇట్టే చేసేస్తారు.

చల్లటి నీటితో స్నానం చేస్తే 5 పెద్ద ప్రయోజనాలు..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Cold Water
uppula Raju
|

Updated on: Sep 29, 2021 | 4:30 PM

Share

Bathing In Cold Water: చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు. కానీ కొంతమంది సులువుగా చేస్తారు. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా ఇట్టే చేసేస్తారు. అయితే చల్లటి నీటితో స్నానం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాల దృష్ట్యా చల్లటి నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రయోజనాలు తెలుసుకుందాం.

1. తక్కువ అనారోగ్యం చల్లని నీటితో స్నానం చేసే వ్యక్తులు తక్కువ అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది పరిశోధకులు చల్లటి నీటితో స్నానం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్ముతున్నారు. చెక్ రిపబ్లిక్ నుంచి ఒక అధ్యయనం ప్రకారం.. యువ అథ్లెట్లు వారానికి మూడు సార్లు ఆరు వారాల పాటు చల్లటి నీటి స్నానం చేశారు.. అప్పుడు వారి రోగనిరోధక శక్తి మెరుగుపడింది. అయితే దీనిని నిర్ధారించడానికి సమగ్ర అధ్యయనం అవసరమని చెప్పారు.

2. నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది చల్లటి నీరు నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. దీనివల్ల నోరాడ్రినలిన్ హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ గుండె రేటును రక్త వేగాన్ని పెంచుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. రక్త ప్రసరణలో మెరుగుదల చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. చల్లటి నీటితో స్నానం చేస్తన్నప్పుడు మొదటగా చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. తర్వాత శరీరం స్వయంగా వేడెక్కవలసి ఉంటుంది. ఈ కారణంగా శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే నాలుగు వారాల తర్వాత కండరాలకు రక్త ప్రసరణ మెరుగుపడిందని ఒక అధ్యయనంలో తేలింది.

4. మానసిక ఆరోగ్య ప్రయోజనాలు శారీరక ప్రయోజనాలు కాకుండా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ‘ఫైట్ లేదా రన్ అవే’ ప్రతిస్పందన కారణంగా మానసిక చురుకుదనం పెరుగుతుందనే సిద్ధాంతం ఉంది. ముఖం, మెడపై చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల వృద్ధులలో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డిప్రెషన్‌ని ఎదుర్కొనేటప్పుడు చల్లటి నీటితో స్నానం చేస్తే మంచి రిలీఫ్ దొరకుతుంది.

5. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ప్రమాదాలు చల్లని నీటిలో స్నానం ఆరోగ్యానికి ప్రయోజనకరమని రుజువు చేయడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. గుండె జబ్బులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరం. ఒక్కోసారి ఇది గుండెపోటుకు కారణం కావచ్చు.

షాకింగ్‌.. ప్రతిరోజు మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలుసా..! ఆశ్చర్యపోతారు..

Punjab Politics: పంజాబ్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌.. సీఎం చన్నీ కేబినెట్ అత్యవసర భేటీ..

Hyderabad City police: అనవసరంగా హారన్ కొట్టొద్దు.. ఫన్నీ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా