Punjab Politics: పంజాబ్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌.. సీఎం చన్నీ కేబినెట్ అత్యవసర భేటీ..

పంజాబ్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సిద్దూకు స్పష్టం చేశారు సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ.

Punjab Politics: పంజాబ్‌ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌.. సీఎం చన్నీ కేబినెట్ అత్యవసర భేటీ..
Punjab Politics
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 29, 2021 | 3:31 PM

Punjab Cabinet Meeting; పంజాబ్‌ రాజకీయాల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సిద్దూకు స్పష్టం చేశారు సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ. సిద్దూతో ఆయన ఫోన్లో మాట్లాడారు. పీసీసీ చీఫ్‌ పదవికి సిద్దూ చేసిన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సాయంత్రం వరకు రాజీనామా వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సిద్దూను ఆదేశించింది. లేదంటే వేరేవాళ్లను ఆ స్థానంలో నియమిస్తామని అల్టిమేటం జారీ చేసింది . సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు సీఎం చన్నీ. సిద్దూకు నచ్చచెప్పడానికి చాలామంది కాంగ్రెస్‌ నేతలు ఆయన నివాసానికి వెళ్లారు.

మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించారు సిద్ధూ. నైతిక విలువల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సిద్ధు. ఇసుక తవ్వకాలపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రణగుర్జీత్‌సింగ్‌కి కేబినెట్‌లో చోటు కల్పించడంపై ఇప్పటికే తన అభ్యంతరం వ్యక్తం చేశారు సిద్ధు.

అయితే, కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం సిద్దూ డిమాండ్లను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సిద్దూకు హైకమాండ్‌ సూచించింది. ఒకవేళ సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్గకపోతే ప్లాన్‌ బీని కూడా సిద్దం చేసింది. సిద్దూ స్థానంలో పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కుల్జీత్‌సింగ్‌ నగ్రా , లేదా ఎంపీ రవ్‌నీత్‌సింగ్‌ బిట్టాకు నియమించేందుకు రంగం సిద్దం చేసింది.

Read Also… China Army: హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. భారత సరిహద్దుల్లో వంతెన పడగొట్టిన వైనం!