China Army: హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. భారత సరిహద్దుల్లో వంతెన పడగొట్టిన వైనం!

పైకి ఒకటి చెప్పడం.. లోపల ఇంకోటి చేయడం.. చైనాకు తెలిసిన ఘరానా విద్య. ఒకపక్క భారత్ తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామంటూ అంతర్జాతీయంగా ప్రకటనలు ఇస్తూవస్తుంది.

China Army: హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. భారత సరిహద్దుల్లో వంతెన పడగొట్టిన వైనం!
China Army In India Boarders
Follow us

|

Updated on: Sep 29, 2021 | 3:26 PM

China Army: పైకి ఒకటి చెప్పడం.. లోపల ఇంకోటి చేయడం.. చైనాకు తెలిసిన ఘరానా విద్య. ఒకపక్క భారత్ తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నామంటూ అంతర్జాతీయంగా ప్రకటనలు ఇస్తూవస్తుంది.. మరోవైపు భారత సరిహద్దుల్లోకి తన సైన్యాన్ని చొప్పించి తలనొప్పులు తీసుకు వస్తూనే ఉంటుంది చైనా. తాజాగా మరోసారి మన సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకు వచ్చింది. వచ్చి ఊరికే పోలేదు.. అక్కడ ఒక బ్రిడ్జిని కూలగొట్టిపోయింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని బారాహోటి సెక్టార్‌లోని సరిహద్దులో చోటు చేసుకుంది. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం గత నెలలో 100 మంది చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖను (LAC) దాటారు. ఈ సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

వార్తా సంస్థ PTI వెల్లడించిన వివరాల ప్రకారం చైనా దళాలు ఆగస్టు 30 న మన సరిహద్దుల్లోకి చొరబడి మూడు గంటల పాటు అక్కడే ఉండి తిరిగివెళ్ళాయి. దీనికి ప్రతిస్పందిస్తూ, భారత సైనికులు కూడా పెట్రోలింగ్ చేశారు. అయితే, చైనా చొరబాటు గురించి అధికారిక సమాచారం ఇవ్వలేదు. మీడియా నివేదికల ప్రకారం.. గుర్రంపై ఉన్న చైనా సైనికులు భారత సరిహద్దులోకి ప్రవేశించి, తిరిగి వచ్చే ముందు వంతెనను ధ్వంసం చేశారు. 1962 యుద్ధానికి ముందు కూడా చైనా బారాహోటి ప్రాంతంలోనే చొరబడ్డారు.

ఉత్తరాఖండ్‌లోని బారాహోటి సెక్టార్‌లో ఎల్ఏసి విషయంలో భారతదేశం, చైనా మధ్య విభేదాల కారణంగా, చిన్న చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఈసారి చైనా సైనికుల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. బారాహోటి సెక్టార్‌లోని ఎల్ఏసి సమీపంలో చైనా తన సైనిక నిర్మాణాలను పెంచింది.

తూర్పు లడఖ్ ఎల్ఏసీలో దాదాపు 8 తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసింది. మీడియా నివేదికల ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కరాకోరం పాస్ దగ్గర వహబ్ జిల్గా నుండి పీయూ, హాట్ స్ప్రింగ్స్, చాంగ్ లా, తాషిగాంగ్, మంజా, చురూప్ వరకు ఉత్తర ప్రాంతంలో తన తాత్కాలిక స్థావరాలు నిర్మించింది. ఇక్కడ ప్రతి ప్రదేశంలో ఏడు క్లస్టర్లలో 80 నుండి 84 కంటైనర్లు తయారు సిద్ధం చేశారు.

ఉత్తరాఖండ్ , అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంట కొత్తగా 10 వైమానిక స్ధావరాలను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తోంది. ఇటీవల ఇరుదేశాల మధ్య విదేశాంగ మంత్రుల చర్చల్లో శాంతి మంత్రం వల్లించినా చైనా తమ బుద్ధి మారలేదని చాటుకుంటోంది. నిఘా నివేదికల ప్రకారం తూర్పు లడఖ్‌లో చైనా తన సైనిక స్థావరాలతోపాటు వైమానిక స్థావరాలను నిర్మించడంలో చాలా బిజీగా ఉంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తన దళాల కోసం మాడ్యులర్ కంటైనర్-ఆధారిత గృహాలను లడఖ్‌లోని భారతదేశంలో లైన్ ఆఫ్ అసలైన కంట్రోల్ (LAC) చుట్టూ ఎనిమిది కొత్త ప్రదేశాలలో నిర్మించింది. ఇది కాకుండా రిమోట్ మానిటరింగ్ సామర్థ్యం ఉన్న సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తోంది. తద్వారా భారతీయ సైనికుల కదలికలను పర్యవేక్షించేందుకు కుట్రలు చేస్తోంది.

గత సంవత్సరం, తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదానికి సంబంధించి చైనా, భారతదేశ సైనికుల మధ్య నెత్తుటి వివాదం జరిగింది. దీని తరువాత, రెండు సైన్యాలు వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి జరిగాయి. అయితే, చైనా ఇప్పుడు మళ్లీ చొరబాటు కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్టు ఇటీవలి సంఘటనలు వెల్లడిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..