Viral Video: చేతులనే కాళ్ళగా మార్చుకుని చిరుతలా పరుగెత్తి.. గిన్నిస్ రికార్డ్ సృష్టి.. వీడియో
కొంతమందికి అన్ని అవయవాలున్నా కష్టపడానికి ఇష్టపడరు. అదృష్టం కలిసి వచ్చి తమను అందలం ఎక్కించాలని.. కొండకు నిచ్చెనవేస్తూ.. ఊహల్లో బతికేస్తారు. లేదంటే ఎవరైనా సాయం చేయాలనీ ఎదురుచూస్తారు.
కొంతమందికి అన్ని అవయవాలున్నా కష్టపడానికి ఇష్టపడరు. అదృష్టం కలిసి వచ్చి తమను అందలం ఎక్కించాలని.. కొండకు నిచ్చెనవేస్తూ.. ఊహల్లో బతికేస్తారు. లేదంటే ఎవరైనా సాయం చేయాలనీ ఎదురుచూస్తారు. అయితే మరికొందరు..జీవితం ఏదైనా సాధించాలనే తపన లేకుండా మనకు దక్కింది ఇంతే అంటూ నిరాశావాదంతో బతికేస్తారు. ఇటువంటివారికి ప్రేరణ ఇచ్చే విధంగా తమకు దేవుడు అన్ని అయవాలను సక్రమంగా ఇవ్వకపోయినా ఏదైనా సాధించాలనే సంకల్పం, ఆత్మ స్థైర్యంతో ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. పట్టుదలతో తమకంటూ చరిత్ర పుటల్లో ఓ పేజీని లిఖించుకుంటున్నారు కొందరు. ఓ యువకుడు తనకు రెండు కాళ్ళు లేకపోయినా.. చేతులను కళ్ళగా మార్చుకుని అత్యంత వేగంగా పరిగెత్తి రికార్డ్ సృష్టించాడు. ఆ వ్యక్తి వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు.. అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా రికార్డు బ్రేక్ చేసాడని ప్రశంసల వర్ధం కురిపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియాక్షన్.. లైవ్ వీడియో