Snakes Halchal: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలపై పగబట్టిన పాములు.. విషసర్పాల కోలాటంతో హడలిపోతున్న విద్యార్థులు
ఆ ప్రభుత్వ కళాశాలను పాములు పగబట్టాయి.. వేలాది మంది విద్యార్థులకు వృత్తి విద్యను నేర్పే ఆ కళాశాలలో విషసర్పాలు కోలాటం చేస్తున్నాయి.. పాములను చూసి పరుగులు పెడుతున్న విద్యార్థులు కాలేజీలో అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు.
Snakes Halchal in Warangal: ఆ ప్రభుత్వ కళాశాలను పాములు పగబట్టాయి.. వేలాది మంది విద్యార్థులకు వృత్తి విద్యను నేర్పే ఆ కళాశాలలో విషసర్పాలు కోలాటం చేస్తున్నాయి.. పాములను చూసి పరుగులు పెడుతున్న విద్యార్థులు కాలేజీలో అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ కాలేజీ పాములకు ఆవాసంగా మారింది. నిత్యం రద్దీగా వుండే ఆ కళాశాలలోకి పాములు ఎక్కడి నుండి వస్తున్నాయో అంతుచిక్కక విద్యార్థులతో పాటు అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాయానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.. 1959లో నిర్మించిన ఈ కాలేజీలో ఎంతోమంది గొప్పగొప్ప మేధావులు విద్యానభ్యశించిన చరిత్ర ఉంది.. ఇప్పటికీ ఈ కాలేజీలో సీటంటే ఫుల్ క్రేజ్.. ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కళాశాల ఇప్పుడు విష సర్పాలకు ఆవసంగా మారింది. కాలేజీకి విద్యార్థులు, అధ్యాపకులు హాజరు కాకపోయినా పాములు మాత్రం క్రమం తప్పకుండా ప్రత్యక్షమవుతున్నాయి. కొండ శిలువలు, త్రాచుపాములు సరదాగా సయ్యాటలాడూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
కాలేజిలో కలియ తిరుగుతున్న పాములు విద్యార్థుల వాహనాలు, అధ్యాపకులు కార్లు, వాహనాలపైకి చేరి బుసలు కొడుతున్నాయి. కొంతమంది విద్యార్థులకు ఈ పాములను చూసిచూసి కామన్ గా మారింది.. కొత్త విద్యార్థులు మాత్రం భయంతో పరుగులు పెడుతున్నారు. క్లాస్ రూమ్ లో కూర్చున్నా ఎటునుండి ఏ పాము మీద పడుతుందో ఎవరి ప్రాణాలు మింగేస్తుందో అనే భయంతో హదలెత్తిపోతున్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో మూడు పాములు కాలేజీలోకి ప్రవేశించాయి. విద్యార్థుల కళ్ల ముందే హల్‌చల్ చేశాయి. పాములను చూసి కొంతమంది విద్యార్థులు పరుగులు పెడితే మరికొందరు సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నిత్యం కాలేజీలో పాములు హల్ చేస్తుండడంతో కొంతమంది విద్యార్థులు కాలేజీకి రావాలంటే వణికి పోతున్నారు..
ఈ కాలేజి ఎక్కడో ఊరి చివర ఉన్న కాలేజీ కాదు. పైగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో.. మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. ఎంజీఎం ఆసుపత్రికి కూడా కూతవేటు దూరంలో ఉంటుంది. భద్రకాళి దేవాలయంకు వెళ్లే ప్రధాన రహదారి కూడా ఈ కాలేజీ ముందు నుండే ఉంటుంది. నిత్యం రద్దీగా వుండే ఈ కాలేజీ పాములకు ఎందుకు ఆవసంగా మారింది…? ఇన్ని పాములు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేదే అంతు చక్కని ప్రశ్నగా మిగిలింది.కాలేజీ లోకి పాము వచ్చిన ప్రతీసారి పాములు పట్టేవారిని పిలిపించి వాటిని పట్టి అడవుల్లో వదిలేస్తున్నారు. అయినా పాములు రావడం మాత్రం తగ్గడంలేదు.
కాలేజీ పరిసరాల్లో చుట్టూ చెత్త, పిచ్చి మొక్కలు, పుట్టలు ఉండడంతో ఈ కాలేజీ పాములకు కేరాఫ్‌గా మారింది. కళాశాల వెనుక బాగంలో ముళ్ల పొదలు, చెట్లు బారీగా ఉండడం, అక్కడే చెత్త వేయడంతో పాములు, కొండ శిలువలకు ఆవాసంగా మారింది. వీటిని శుభ్రం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాధుడే లేడని కళాశాల సిబ్బంది చెబుతున్నారుజ దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ కొంత డబ్బులు వెచ్చించి పుట్టలు తొలగించడం, పిచ్చి మొక్కలు క్లీనింగ్ చేయించారు. అయినా, కళాశాల బయట వ్యర్థాలు, చెట్లు బారీగా ఉండడంతో పాముల బెడద నుండి విముక్తి లభించడం లేదు.. అధికారులు స్పందించి తమకు ఈ పాముల పరిహాసం నుండి విముక్తి కల్పించాలని అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాల్ కోరుతున్నారు.
ఈ పాముల పరిహాసంతో అటెండర్లు కూడా పాములపై ఓ కన్నేసి కాపలా కూర్చోవల్సి వస్తుంది. పాములు పెట్టె వారికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ పాముల సమస్యకు పరిష్కారం చూపి.. విద్యార్థులు, అధ్యాపకులకు పూర్తి భద్రత కల్పిస్తారని ఆశిద్దాం… Read Also… IPL 2021 : డేవిడ్ భాయ్ ఇక పరాయి వాడేనా..? హైదరాబాద్ జట్టుకు డేవిడ్ గుడ్ బై.?(వీడియో)