IPL Betting: యాప్‌లతో వేల రూపాయల పందేలు కాస్తారు.. బాప్ రే అనిపించేంతగా లక్షలు కొల్లగొడ్తారు.!

యాప్ లతో వాళ్లు వేల రూపాయల పందేలు కాస్తారు. బాప్ రే అనిపించేంతగా.. లక్షలు కొల్లగొడ్తారు. మొత్తంగా కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తారు.

IPL Betting: యాప్‌లతో వేల రూపాయల పందేలు కాస్తారు.. బాప్ రే అనిపించేంతగా లక్షలు కొల్లగొడ్తారు.!
Cricket Bettings
Follow us

|

Updated on: Sep 29, 2021 | 2:08 PM

Cricket Betting – Hyderabad Police: యాప్ లతో వాళ్లు వేల రూపాయల పందేలు కాస్తారు. బాప్ రే అనిపించేంతగా.. లక్షలు కొల్లగొడ్తారు. మొత్తంగా కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తారు. మన మధ్యలోనే ఉంటూ- మన కంటి ముందే తిరుగుతూ.. గూగుల్ సాయంతో.. ఎదుటి వారిని బరిలోకి దించుతూ.. బెట్టింగ్ నిర్వహిస్తుంటారు. పక్కా సమాచారంతో.. ఇలాంటి బెట్టింగ్ గ్యాంగును అరెస్టు చేసింది సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్.

దుబాయ్ లో జరుగుతున్న ముంబై వర్సెస్ పంజాబ్- ఐపీఎల్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ లే టార్గెట్ గా.. కాయ్ రాజా కాయ్ అంటూ.. పందేల మీద పందేలు.. నిర్వహించే పందెం రాయుళ్లు.. ఎక్కడెక్కడుంటారో.. పసిగట్టి.. మొత్తం 7 చోట్ల దాడులు చేశారు సైబరా బాద్ పోలీసులు. మియాపూర్- బాచుపల్లి- గచ్చిబౌలి- మైలార్ దేవ్ పల్లిలో ఈ దాడులు చేశారు. 23 మంది బుకిలను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా.. 93 లక్షల రూపాయల సీజ్- 2. 2 కోట్లు విలువ చేసే సొత్తు స్వాధీనం.. చేసుకున్నారు పోలీసులు.

గూగుల్ మొబైల్ యాప్స్ తో ఈ బెట్టింగ్ చేస్తున్నట్టు గుర్తించారు హైదరాబాద్ పోలీసులు. మొత్తం నాలుగు లేయర్ల పాటు.. ఈ బెట్టింగ్ నడుస్తోన్నట్టు చెబుతున్నారు అధికారులు. బెజవాడకు చెందిన మహా అనే మెయిన్ బుకీతోపాటు మరో ముగ్గురు బుకీలు పని చేస్తున్నారనీ.. మొబైల్ యాప్స్ ద్వారా సమచారం అందుకుని ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా చెబుతున్నారు అధికారులు.

వీరిపై గేమింగ్ యాక్ట్ కలుపుకుని మొత్తం 7 కేసులు నమోదు చేశారు. సరిగ్గా అదే సమయంలో.. బెట్టింగ్ కు అనువుగా ఉంటోన్న యాప్స్ తొలగించమని గూగుల్ కి లేఖ రాస్తామంటున్నారు పోలీసులు.

Read also: India Border Tension: ఉగ్రవాదం, చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? ఎందుకు అమెరికా రీసెర్చ్‌ సంస్థ హెచ్చరికలు?