AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Border Tension: ఉగ్రవాదం, చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? ఎందుకు అమెరికా రీసెర్చ్‌ సంస్థ హెచ్చరికలు?

భారత్‌ సరిహద్దులో ఏం జరుగుతోంది? అటు ఉగ్రవాద సంస్థలు, ఇటు చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? అదను కోసం ఎదురుచూస్తున్నాయా ?

India Border Tension: ఉగ్రవాదం, చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? ఎందుకు అమెరికా రీసెర్చ్‌ సంస్థ హెచ్చరికలు?
India Border Tension
Venkata Narayana
|

Updated on: Sep 29, 2021 | 1:52 PM

Share

American Congressional research service report: భారత్‌ సరిహద్దులో ఏం జరుగుతోంది? అటు ఉగ్రవాద సంస్థలు, ఇటు చైనా సైన్యం భారత్‌ను చుట్టుముడుతోందా ? అదను కోసం ఎదురుచూస్తున్నాయా ? అమెరికాకు చెందిన కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ సంస్థ చేసిన హెచ్చరికలు ఏంటి ? పరిశీలిస్తుంటే.. అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మాతున్నాయనిపిస్తోంది. తాలిబన్ల విజయం మిగతా ఉగ్రవాద సంస్థలకు ఊపిరినిచ్చింది. దీంతో అల్‌ఖైదా, లష్కరే తొయిబా, జైషె మొహమ్మద్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. తాజాగా భారత్‌ చుట్టూ ఉగ్రవాద సంస్థలు మోహరించాయి. పాకిస్తాన్‌ను అడ్డాగా చేసుకుని 12 ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న అమెరికాకు చెందిన కాంగ్రెషనల్‌ రీసెర్చ్ సర్వీస్‌ సంస్థ హెచ్చరించింది. భారత్‌ సహా అనేక దేశాలకు టెర్రరిస్ట్‌ గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్‌ ఇచ్చింది. భారత్‌కు మరోవైపు చైనా సైన్యాలు సరిహద్దు నుంచి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో సరిహద్దులో ఎప్పుడు ? ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

పాకిస్తాన్‌లో దాదాపు 12 ఉగ్రవాద సంస్థలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్టు కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ సంస్థ హెచ్చరించింది. లష్కరే తొయిబా, జైషె మొహమ్మద్‌ సహా 12 ఉగ్రవాద సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అల్‌ఖైదాకు సురక్షిత ప్రాంతంగా కొనసాగుతోంది పాకిస్తాన్‌. ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ కూడా పాకిస్తాన్‌ నుంచే తమ కార్యకలాపాలను సాగిస్తోంది. అఫ్గాన్‌ తాలిబన్‌ అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్‌నే కేంద్రంగా చేసుకుంది. ఇక హక్కానీ నెట్‌వర్క్‌ అడ్డాగా ఉంది పాకిస్తాన్‌.

తెహ్రిక్‌-ఇ- తాలిబన్‌ ఉగ్రవాద సంస్థకు కూడా పాకిస్తాన్‌ సురక్షిత ప్రాంతంగా ఉంది. పాక్‌ నుంచే బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ తన టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ ను సాగిస్తోంది. అకా జైష్‌ అల్‌ అద్‌ అనే టెర్రరిస్ట్‌ సంస్థ కూడా పాకిస్తాన్‌నే కేంద్రంగా చేసుకుంది. సిపాహీ సహ్‌బా పాకిస్తాన్‌ అనే టెర్రరిస్ట్‌ గ్రూప్‌ కూడా పాక్‌నే అడ్డాగా మార్చుకుంది. లష్కరే లాంగ్వి అనే ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్‌లోనే ఉంది. ఇందులో చాలా ఉగ్రవాద సంస్థలు భారత్‌ టార్గెట్‌గా పనిచేస్తున్నాయని కాంగ్రెషనల్‌ రీసెర్చ్ సర్వీస్‌ సంస్థ హెచ్చరించింది. కొన్ని ఉగ్రవాద సంస్థలు హిజుబుల్‌ ముజాహిద్దీన్‌ మిలిటెంట్ గ్రూపుల కలయికతో కలిసి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 1980 నుంచే టెర్రరిస్ట్‌ గ్రూపులను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్‌. 1980 నుంచి లష్కరే తొయిబా తన ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2001లో జైషె మొహమ్మద్‌ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించారు.

ఇటు భారత సరిహద్దులో ఉన్న చైనా కూడా ఇండియన్‌ భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందేందుకు ప్రయత్నిస్తోంది. లద్దాఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, టిబెట్‌ సరిహద్దు వెంబడి భారీగా ఆధునిక గ్రామాల నిర్మాణం చేపట్టింది. 2017లో 628 ఆధునిక గ్రామాల నిర్మాణం చేపట్టింది చైనా. త్వరలోనే దీనిపై చైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. 2017లో జియాకాంగ్‌ గ్రామాల విధానాన్ని చేపట్టింది. 21 కౌంటీల్లో 628 గ్రామాల నిర్మాణం చేపట్టింది. మొత్తం 62,160 ఇళ్ల నిర్మాణం చేపట్టింది చైనా. ఇందులో 2 లక్షల 41 వేల 835 మంది నివసించబోతున్నారు.

లద్ధాఖ్‌ నుంచి నింగ్‌ఛి వెంబడి టిబెట్ సరిహద్దులో గ్రామాలను నిర్మించింది చైనా. అరుణాచల్‌-మయన్మార్‌ వెంబడి మెచుకా సరిహద్దులో కూడా గ్రామాలను నిర్మించింది. 2020లో 604 గ్రామాల నిర్మాణం పూర్తి చేసింది. వీటి నిర్మాణం కోసం 4.6 బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది చైనా ప్రభుత్వం. చైనా, భారత్‌ మధ్య 3,500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గత నెల 30న ఉత్తరాఖండ్‌లోని బారాహోటిలోకి 100 మంది చైనా సైనికులు చొరబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అటు పాక్‌, ఇటు చైనా నుంచి భారత్‌కు ముప్పేట దాడి పొంచి ఉందనే డెంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. దీంతో ఇటు భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. ఎప్పుడు ? ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

Read also: Gulab Cyclone: పోతూ.. పోతూ.. తెలుగు రైతన్నల గుండెల్లో గునపాలు దించిన గులాబ్.!