Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అది శవాల దిబ్బనా.. దెయ్యాల అడ్డానా..?.. మిస్టరీ వీడింది

అదొక చిన్న గుంత.. కాదు..కాదు.. గుంతలా కనిపించే ఒక పెద్ద బావి. దూరం నుంచి చూసి ఎవరైనా దాన్ని ఏదో గుంత అనుకుంటారు కానీ... దగ్గరకు వెళ్లి చూసారో షాకవుతారు.

Viral News: అది శవాల దిబ్బనా.. దెయ్యాల అడ్డానా..?.. మిస్టరీ వీడింది
Yemen Well Hell Mystery
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 29, 2021 | 1:26 PM

అదొక చిన్న గుంత.. కాదు..కాదు.. గుంతలా కనిపించే ఒక పెద్ద బావి. దూరం నుంచి చూసి ఎవరైనా దాన్ని ఏదో గుంత అనుకుంటారు కానీ… దగ్గరకు వెళ్లి చూసారో షాకవుతారు. ఈ బావి గురించి చుట్టుపక్కల ఊరి వాళ్లు కథలు కథలుగా చెప్తుంటారు. కొందరేమో దుష్టశక్తులు కొలువైన బావిగా చెప్తారు. చాలామంది మాత్రం శవాల దిబ్బ అని చెబుతారు. ఖైదీలను, శత్రువులను ఊచకోత కోసి గుంపులుగా అందులో పడేసేవారనే ప్రచారంకూడా జరిగింది ఆమధ్య. కానీ దీని రహస్యాన్ని ఛేదించారు కొందరు సాహసికులు.

ఈ భారీ బావి గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో, అసలు ఆ బావి కథేంటో తేల్చేందుకు తాజాగా ఎనిమిది మంది సాహసికులతో కూడిన ఓ బృందం బావి లోపలికి దిగింది. బావిలోపల ప్రదేశాన్ని చూసి సాహసికుల బృందం షాకైంది. అందులో శవాల గుట్టలుగానీ, అస్థిపంజరాలుగానీ ఏవీ కనిపించకపోగా.. అందమైన లోయ అడుగున ఓ జలపాతం కనిపించింది. అక్కడ వారికి రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు దొరికాయి. అక్కడక్కడ కొన్ని పాములు కూడా కనిపించాయట. 112 మీటర్ల లోతున్న ఆ బావి నరక కూపం కాదని, అది ప్రకృతి ప్రసాదించిన అందమైన ప్రదేశమని తేల్చారు. దీని పేరు బార్‌హౌట్‌ బావి. లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న యెమెన్‌ ఆల్‌ మహారాలోని బార్‌హౌట్‌ బావి.. చాలా ఏళ్ల నుంచి ఒక మిస్టరీగా ఉండిపోయింది. అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్‌ చేసి.. ఆ బావి వయసు తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. గతంలో యెమెన్‌ అధికారుల బృందం ఒకటి ఈ బావిలో 50-60 మీటర్ల దాకా వెళ్లి భయంతో వెనక్కి వచ్చేసిందట. ప్రస్తుతం ఈ భారీ బావి మిస్టరీని చేధించినప్పటికీ.. ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ బావి పక్కకు వెళ్లమని చెప్తున్నారు.

Also Read:  సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్

 నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం