World Heart Day: లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు. యుక్తవయసులో వచ్చే గుండెపోటును ఎలా నివారించాలో తెలుసుకోండి..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గుండె జబ్బుల సమస్యలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారిని ఈ సమస్య ఎక్కువగా

World Heart Day: లక్షణాలు లేకుండానే గుండె జబ్బులు. యుక్తవయసులో వచ్చే గుండెపోటును ఎలా నివారించాలో తెలుసుకోండి..
Heart Day
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 29, 2021 | 1:11 PM

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గుండె జబ్బుల సమస్యలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్నవారిని ఈ సమస్య ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఆకస్మాత్తుగా గుండెపోటుతో పెద్దవారికంటే.. యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ద తీసుకున్నప్పటికీ ఈ గుండెపోటు, గుండె జబ్బులు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ప్రపంచ వ్యాప్తంగ గుండె జబ్బుల అవగాహన కల్పించనున్నారు. శరీరంలో అతి ముఖ్యమైన భాగమే.. మారుతున్న జీవనశైలి కారణంగా.. గుండె పనితీరు బలహీనపరుస్తుంది. ఇటీవల గుండె పోటు , గుండె జబ్బులు ఎలాంటి లక్షణాలు లేకుండా.. ఆకస్మాత్తుగా దాడి చేస్తున్నాయి. అయితే సాధారణంగా కొన్ని లక్షణాలు గుండెకు సంబంధించిన వ్యాధులలో కనిపిస్తాయి. అయితే లక్షణాలు లేకుండా.. ఎలా గుర్తించాలి.. యుక్తవయసులో వారికే ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందామా.

ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్,కార్డియాలజీ, ఎలెక్ట్రోఫిజియాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ నిత్యానంద్ త్రిపాఠి వివరణ ప్రకారం లక్షణాలు లేని వ్యక్తులకు గుండె జబ్బులను నివారించాలనుకుంటే.. ముందుగా ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోవాలి. ధారణంగా డయాబెటిస్, రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. మొదటి రక్త సంబంధంలో హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే, అటువంటి వ్యక్తులు లక్షణాలు లేకుండా గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో గుండె గట్టిపడటం మొదలవుతుంది , శ్వాసలోపం మొదలవుతుంది. ఇవే కాకుండా… కుటుంబంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు లాంగ్ క్యూటి సిండ్రోమ్ కలిగి ఉంటారో వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నింటికి గుండె జబ్బు లక్షణాలు కనిపించవు.

గుండె జబ్బు లక్షణాలు 55 సంవత్సరాల వయసులో ఉన్న పురుషులు, 50 ఏళ్ల కంటే తక్కువ ఉన్న మహిళలు క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. వీరు మూడు సంవత్సరాలకు ఒకసారి బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, ఎకోకార్డియోగ్రఫి, టీఎంటీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఇతర వ్యాధులు ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. కొన్నిసార్లు ఈ పరీక్షలు గుండె జబ్బుల లక్షణాలను కూడా చూపిస్తాయి. లక్షణాలు ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుతం గుండెపోటు యుక్తవయసులో ఉన్నవారికి వస్తుంది. సాధారణంగా కొరోనరీ ఆర్టరీలో అడ్డంకి ఏర్పడితే.. గుండెపోటు ప్రమాదం 20 శాతం పెరుగుతుంది. టెన్షన్ ఉన్నప్పుడు, వ్యాయమం చేసేటప్పుడు, పరుగెత్తేటప్పుడు ఆకస్మాత్తుగా వస్తుంది. అలాగే రాత్రిళ్లు ఎలాంటి ఒత్తిడి టెషన్స్ లేకుండా హాయిగా నిద్రపోయిన వ్యక్తికి కూడా గుండె పోటు వస్తుందని చాలా సార్లు వినే ఉంటాం. అలాగే ఎంత ఫిట్ నెస్ ఉన్న 30 ఏళ్ల వ్యక్తి కూడా ట్రెడ్ మిల్ పై పరుగెడుతూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. అయితే వీరు ఎలాంటి లక్షణాలు లేకుండా మరణించరు. గతంలో వీరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. టెన్షన్ లో ఉన్నప్పుడు అరవడం.. ఛాతీలో ఒత్తిడి, నొప్పి, గుంతులో అడ్డుగా ఉనట్లు అనిపిస్తే జాగ్రత్తలు అవసరం. కానీ డయాబెటిస్ రోగులలో ఈ లక్షణాలు కనిపించవు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి నరాలు దెబ్బతింటాయి. కండరాలు జన్యుపరంగా లావుగా ఉన్నవారిలోనూ ఈ ప్రమాదం ఉంటుంది.

జాగ్రత్తలు – క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జాగింగ్, ట్రెడ్‌మిల్ లేదా వ్యాయామం చేయాలి. – చక్కెర, తెల్ల బియ్యం, మైదా, బంగాళాదుంపలకు దూరంగా ఉండండి. డయాబెటిస్ ఉంటే, వాటిని వెంటనే మానుకోవాలి. – రోజుకు 15 మి.లీ నూనె మాత్రమే వాడండి. – కొవ్వు వెన్నని వాడటం మానేయండి – ప్రతి 6 నెలలకు మీరు తినే నూనెను మార్చుకోండి – – పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి – బరువును నియంత్రించండి – – ధూమపానం, మద్యం మరియు పొగాకు మానేయండి.

Also Read: Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విజ్ఞప్తి.. లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏లో ఏమన్నారంటే..