AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విజ్ఞప్తి.. లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏లో ఏమన్నారంటే..

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూతపడడం.. షూటింగ్స్ ఆగిపోవడంతో.. చిత్రపరిశ్రమ ఆర్థిక

Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విజ్ఞప్తి.. లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏లో ఏమన్నారంటే..
Nagarjuna
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 29, 2021 | 4:13 PM

Share

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూతపడడం.. షూటింగ్స్ ఆగిపోవడంతో.. చిత్రపరిశ్రమ ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పడిప్పుడే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తిరిగి కోలుకుంటుంది. కరోనా కేసులు తగ్గడంతో.. తమ సినిమాల షూటింగ్స్ వేగవంతం చేశారు మేకర్స్. అలాగే వరుస అప్డేట్స్ ఇస్తూ.. ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇక గత కొద్దిరోజులు భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ సినీ పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా సినీ పరిశ్రమను పట్టించుకోవాలని కోరారు.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతూ..నిర్మాతలకు ఊరట కలిగించింది. ఈ క్రమంలో నిన్న జరిగిన లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏కు నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద సినిమా డ్రీమ్ రన్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే లవ్ స్టోరీ చిత్రయూనిట్, నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ కార్యక్రమంలోనే.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను నాగ్ రిక్వెస్ట్ చేశారు. తెలుగు వారికి తెలుగు సినిమా అంటే విపరీతమైన ప్రేమ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే ఒక విన్నపం.. మమ్మల్ని ఆశీర్వదించమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను అని నాగార్జున కోరారు. అంతకుముందు లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ సినిమా పరిశ్రమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా.. తన అభిప్రాయాలను తెలుపుతూ.. ప్రభుత్వాలను నుంచి సినీ పరిశ్రమకు మద్దతు ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Rashmika Mandanna: పుష్ప సర్‏ప్రైజ్ వచ్చేసింది.. రష్మిక ఫస్ట్‏లుక్ అదుర్స్..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ బ్యూటీఫుల్ ఫోటోలు..

Shekar Kammula: చిరంజీవి ఇచ్చిన కిక్ స్టార్టే బిగ్ సక్సెస్.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. సక్సెస్ మీట్‏లో శేఖర్ కమ్ముల..