AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shekar Kammula: చిరంజీవి ఇచ్చిన కిక్ స్టార్టే బిగ్ సక్సెస్.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. సక్సెస్ మీట్‏లో శేఖర్ కమ్ముల..

క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రేక్షకాధరణ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను ఆడియన్స్

Shekar Kammula: చిరంజీవి ఇచ్చిన కిక్ స్టార్టే బిగ్ సక్సెస్.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. సక్సెస్ మీట్‏లో శేఖర్ కమ్ముల..
Shekar Kammula
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 29, 2021 | 4:13 PM

Share

క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రేక్షకాధరణ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను ఆడియన్స్ సూపర్ హిట్ అందించారు. ఆనంద్, గోదావరి సినిమాల నుంచి నేటి లవ్ స్టోరీ మూవీ వరకు ప్రతి సినిమా బిగ్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్‏తోపాటు..యూత్‏ను అట్రాక్ట్ చేయడంలోనూ శేఖర్ కమ్ముల మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన అందమైన ప్రేమకథ చిత్రం లవ్ స్టోరీ మూవీ మ్యాజికల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈనెల 24న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ సక్సెస్ మీట్‏ను హైదరాబాద్‏లోని ఓ హోటల్‏లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జున, సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది.. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంతగా టెన్షన్ పడలేదు. కానీ ఈ మూవీకి మాత్రం చాలా టెన్షన్ ఎదుర్కొని మీ ముందుకు వచ్చాం. కానీ ఇప్పుడు మీరు అందించిన ఈ సక్సెస్ చూశాక చాలా సంతోషంగా ఉంది. ఇందుకు థ్యాంక్స్ తప్ప ఇంకా వేరే పదాలు నా దగ్గర లేవు. ఈ సినిమా కోసం సాయి పల్లవి, నాగచైతన్య ఎంతగానో కష్టపడ్డారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పవన్ మ్యాజిక్ చేసారు. ప్రీ రిలీజ్ వేడుకలో అందరూ థియేటర్లకు రండి రండి అంటూ కిక్ స్టార్ట్ మా సినిమాకు బిగ్ సక్సెస్ అయ్యింది. థ్యాంక్యూ చిరంజీవి గారు. మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకు కూడా అలాగే పెద్దగా నిలబడ్డారు. ముఖ్యంగా డైరెక్షన్ టీం చాలా కష్టపడ్డారు. ఈశ్వరీ గారు చాలా బాగా చేశారు. అలాగే దేవయాని, చక్రపాణి, రాజీవ్ కనకాల ఎంతో బాగా చేశారు. ఇందుకు సహకరించిన సుమకు… అలాగే ఉత్తేజ్ నటకు ధన్యావాదాలు తెలిపారు శేఖర్.

Also Read: Pushpa Movie: పుష్ప షూటింగ్‏కు బ్రేక్ !!.. అల్లు అర్జున్ సినిమా ఆలస్యానికి కారణం అదేనా ?

Sai Pallavi: నాగార్జున గురించి తాతయ్య చెప్పిన మాటలకు షాకయ్యాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన సాయి పల్లవి..

Samantha: అవన్నీ పుకార్లే.. హైదరాబాదే నాకు ఇల్లు, అన్నీ ఇచ్చింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు