Poonam Kaur: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్

హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను, తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.

Poonam Kaur: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్
Poonam Kaur
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 29, 2021 | 4:13 PM

హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను, తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా  దర్శకరత్న, దివంగత దాసరి నారాయణరావుని గుర్తు చేసుకుంటూ పూనమ్ వేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ ట్వీట్‌లో ఆమె దాసరి నారాయణరావు నటించిన ‘రౌడీ దర్బార్’ సినిమాలోని ‘‘ఇంద్రలోకం పార్టీ.. చంద్రలోకం పార్టీ.. మీ జెండాలకు వేల వేల దండాలయా.. మీ పార్టీల్లో గూండాలను చేర్చకండయా..’’ అనే వీడియో సాంగ్‌ని పోస్ట్ చేసి.. దయచేసి ఈ పాటను వినండి అని కోరారు.  ఆ వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక గురువు దాసరిగారు.  ఆయనను చాలా మిస్సవుతున్నాను. నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఈరోజు దాసరిగారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను..’’ అని ఆమె సదరు ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్స్ వేయడం వెనుక ఆమె ఉద్దేశ్యం ఏమై ఉంటుందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పూనమ్ వేసిన ట్వీట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా పూనమ్ కౌర్ 2018 లో రిలీజ్ అయిన నెక్ట్స్ ఏంటి సినిమాలో చివరిసారిగా నటించారు. ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. కాగా సోషల్ మీడియాలో పూనమ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read: నిమిషం వ్యవధిలో భార్యాభర్తలు మృతి… ఆ దృశ్యం చూసి డాక్టర్ల ఉద్వేగం

పవన్‌పై లక్ష్మీ పార్వతి ఫైర్.. విష వృక్షం నీడలో ఉన్నారని కామెంట్