Health: ఉదయం లేవగానే నిమ్మరసం తాగుతున్నారా.? అయితే రాత్రి పడుకునే ముందు కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే..
Health: కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో రకరకలా..
Health: కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి పెరిగింది. ఆహార అలవాట్లు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వంటివి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో రకరకలా ఆహారపదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే పరగడుపున నిమ్మరసం కలిపిన నీరు తీసుకోవడం ఒక దిన్యచర్యగా మారిపోయింది. నిమ్మ రసంలో ఉండే విటమిన్ సి కరోనాకు విరుగుడు అని నిపుణులు చెప్పడమే దీనికి కారణం.
అయితే ఉదయం పరగడుపున కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా నిమ్మరసంతో ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా.? రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం కలుపుకొని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* నిమ్మకాయంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్యాలను విటమిన్ సితో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట పడుకునే ముందు నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
* సాధారణంగా రాత్రి పడుకున్న తర్వాత కనీసంలో కనీసం ఏడు గంటల పాటు ఎలాంటి నీటిని తీసుకోము ఈ కారణంగా శరీరం డీ హైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు నిమ్మరసం తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం ఎండి పోకుండా తేమగా ఉండడంలో నిమ్మరసం క్రీయాశీలకంగా పనిచేస్తుంది.
* మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే రాత్రి పడుకునే ముందు కాస్త నిమ్మరసం తాగండి మంచి ఫలితం కనిపిస్తుంది. ఎలాంటి చక్కరలేని నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గించుకోవచ్చు.
* జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్న వారు కూడా రాత్రి పడుకునే ముందు నిమ్మరసం తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది. ఇది కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
* ఉదయం లేవగానే చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. అయితే పడుకునే ముందు నిమ్మరసం తాగి పడుకుంటే ఉదయం లేవగానే వేదించే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. నిమ్మరసం ఒక మంచి నేచురల్ మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
* కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతోన్న వారు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కాల్షియంతో కూడిన రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
Heart Stroke: ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..