Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ పరిశ్రమలోకి జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. మొదటి సినిమాతోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్

Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..
Nagachaitanya
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 29, 2021 | 4:12 PM

అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ పరిశ్రమలోకి జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. మొదటి సినిమాతోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చై.. ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. టాలీవుడ్ స్టార్ హీరోగా మారారు. అయితే ఇప్పటివరకు చైతూ.. నటించిన సినిమాల్లో లవ్ స్టోరీ మూవీ స్పెషల్. చైతన్య కెరీర్‏లోనే అతి తక్కువ సమయంలో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా లవ్ స్టోరీ నిలిచింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ రిలీజ్ వారం రోజులు అవుతున్న కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. ఇందులో చైతూకి జోడిగా సాయి పల్లవి నటించగా.. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం నేరుగా థియేటర్లలో విడుదలై అతి పెద్ద హిట్ అందుకున్న సినిమాగా లవ్ స్టోరీ నిలిచింది. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‏లో ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున, డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

అలాగే సాయి పల్లవి, నాగచైతన్య, శేఖర్ కమ్ముల ఈ వేడుకలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానని.. సినిమా విడుదలతో ఆ ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగించిందని అన్నారు. నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటీ ? క్రిటిక్స్ ఏమంటున్నారు ? అని తెలుసుకుంటా.. వాటిని బట్టి ముందుకెళ్తుంటాను. కోవిడ్ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా.. ఈ నెల 24న లవ్ స్టోరీ విడుదల కావడంతో ఎంతో ఆనందించాను. థియటర్లకు వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి అనేక విషయాలను తెలుసుకున్నాను. మా ప్రయాణం ఈ సినిమా విడుదలతో ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్.. అంటూ శేఖర్ కమ్ములను కోరారు నాగచైతన్య. లవ్ స్టోరీ సినిమాలో దేవయాని, ఈశ్వరీ, రాజీవ్ కనకాల కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం పవన్ అందించారు.

Also Read: Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నాగార్జున విజ్ఞప్తి.. లవ్ స్టోరీ సక్సెస్ మీట్‏లో ఏమన్నారంటే..

Shekar Kammula: చిరంజీవి ఇచ్చిన కిక్ స్టార్టే బిగ్ సక్సెస్.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. సక్సెస్ మీట్‏లో శేఖర్ కమ్ముల..