Amala Paul: అమలా పాల్ బికిని డ్రెస్‌పై ట్రోల్స్.. నా డ్రెస్ నా ఇష్టమంటూ తిప్పికొట్టిన బ్యూటీ.

Amala Paul: 2009లో తమిళ సినిమా పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార అమలా పాల్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసిందీ బ్యూటీ. తొలి సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో...

Amala Paul: అమలా పాల్ బికిని డ్రెస్‌పై ట్రోల్స్.. నా డ్రెస్ నా ఇష్టమంటూ తిప్పికొట్టిన బ్యూటీ.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 29, 2021 | 4:12 PM

Amala Paul: 2009లో తమిళ సినిమా పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది అందాల తార అమలా పాల్‌. తొలి సినిమాతోనే తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసిందీ బ్యూటీ. తొలి సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో నటించిన అమలా ఆ తర్వాత గ్లామర్‌ పాత్రలకు మొగ్గు చూపింది. ఇక రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది టాలీవుడ్‌లోనూ మంచి సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అమలాపాల్‌ తన సినిమాలతో ఎంత పాపులరో తన పనులతోనూ అంతే పాపులర్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. మనసులో ఉన్న మాటను ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పే అమలా పాల్‌ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరీ ముఖ్యంగా ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా తన గ్లామర్‌ ఫొటోలోను పోస్ట్ చేస్తూ వస్తోందీ అందాల తార. ఈ క్రమంలో అమలా తాజాగా సముద్ర ఒడ్డున బికినిలో దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలతో పాటు పలు ఆసక్తికర క్యాప్షన్‌లను పోస్ట్‌ చేసింది. అయితే వీటిలో అమలా కాస్త గ్లామర్‌ డోస్‌ను పెంచేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. అసలు అదేం డ్రెస్‌ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ట్రోలింగ్‌ను భరించని అమలా తనదైన శైలిలో స్పందించింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనేది వారి ఇష్టం. అమ్మాయిల వస్త్రధారణను ఏ ఒక్కరు నిర్ధేశించాల్సిన అవసరం లేదు’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. ఇక అమలా కెరీర్‌ విషయానికొస్తే.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘పిట్ట కథలు’, తొలి తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహాలో వచ్చిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీటిలో అమలా నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమాలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

Also Read: Ariyana Glory New Car Photos: తగ్గెదె లే అంటున్న బిగ్ బాస్ బ్యూటీ.. కొత్త కారుతో అరియానా ఫోటో షూట్..

Poonam Kaur: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్స్

Shekar Kammula: చిరంజీవి ఇచ్చిన కిక్ స్టార్టే బిగ్ సక్సెస్.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.. సక్సెస్ మీట్‏లో శేఖర్ కమ్ముల..