AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 : డేవిడ్ భాయ్ ఇక పరాయి వాడేనా..? హైదరాబాద్ జట్టుకు డేవిడ్ గుడ్ బై.?(వీడియో)

IPL 2021 : డేవిడ్ భాయ్ ఇక పరాయి వాడేనా..? హైదరాబాద్ జట్టుకు డేవిడ్ గుడ్ బై.?(వీడియో)

Anil kumar poka
|

Updated on: Sep 29, 2021 | 3:05 PM

Share

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అస్సలు అచ్చిరాలేదని చెప్పాలి. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఇదిలా ఉంటే

ఐపీఎల్ 2021 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అస్సలు అచ్చిరాలేదని చెప్పాలి. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడగా.. అందులో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా సన్‌రైజర్స్ నిష్క్రమించింది. ఇదిలా ఉంటే నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ స్థానంలో జేసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. ఇక అదే సమయంలో డేవిడ్ భాయ్ స్టేడియంలో కనిపించకపోవడం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌ను బాధపెట్టింది. ఇకపై ఆరెంజ్ జెర్సీలో వార్నర్‌ను చూస్తామో లేదో అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మొదట అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక కొద్దిరోజుల్లో మెగా ఆక్షన్ జరగనుండగా.. వార్నర్‌ను ఇకపై ఆరెంజ్ జెర్సీలో చూడలేమని సన్‌రైజర్స్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ”తనను మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చూడలేరని.. అయినా జట్టుకు సపోర్ట్ చేస్తూనే ఉండండి” వార్నర్ రిప్లయ్ ఇచ్చాడు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు వార్నర్ మొత్తానికి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Pawan kalyan Live Video: మంగళగిరికి జనసేనాని… మంగళగిరిలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ.. లైవ్ వీడియో..

 Huzurabad politics live video: మళ్ళీ హీటెక్కిన హుజూరాబాద్… షెడ్యూల్ విడుదలతో మొదలైన అసలు రచ్చ..(లైవ్ వీడియో)

 Posani vs Pawan fans: పవన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు.. మీ ఫ్యాన్స్ తో చంపిస్తావా రెడీ.. డెడ్ బాడీ అయినా వదలను..(వీడియో)

 Viral Video: డ్రైనేజ్‌గుంతలో పడిపోయిన వ్యక్తి..! సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న వీడియో..