AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medicines Rates Reduced: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. బీపీ, షుగర్‌, గుండెజబ్బుల మందుల ధరలు తగ్గింపు..!

ఉరుకులు-పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యాన్నే మరిచిపోతున్నాడు. కనీస ప్రమాణాలు పాటించక అనారోగ్యం పాలవుతున్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు.

Medicines Rates Reduced: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. బీపీ, షుగర్‌, గుండెజబ్బుల మందుల ధరలు తగ్గింపు..!
Medicine Rates
Balaraju Goud
|

Updated on: Sep 29, 2021 | 4:29 PM

Share

Medicines Rates Reduced: ఉరుకులు-పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యాన్నే మరిచిపోతున్నాడు. కనీస ప్రమాణాలు పాటించక అనారోగ్యం పాలవుతున్నారు. ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహ వ్యాధి, గుండె జబ్బులు, ఆస్తమా.. ఇలా కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. వీటికి తోడు మారిన ఆహారపు అలవాట్లు మరింతగా క్షిణిస్తున్నారు. ప్రస్తుతం వయస్సుతో నిమిత్తం లేకుండా వివిధ రకాల వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ జబ్బులను అదుపులో పెట్టడానికి రోజూ మందులు వాడక తప్పడంలేదు. ఇందుకోసం మనిషి తానూ సంపాదించిన దాంట్లో అత్యధిక భాగం సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి తోడు కరోనా మహమ్మారి దాపురించి మరింత కృంగదీసింది. ఈ నేపథ్యంలో కొన్ని అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ నేషనల్‌ ఫార్మా ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) తన 92వ అధికారిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

కొన్ని అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ ఎన్‌పీపీఏ తన 92 వ అధికారిక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. విదాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌, ఎరిత్రోపోయటిన్‌ ఇంజెక్షన్‌, లెవిటిరాసెటమ్‌ ఇంజక్షన్‌, క్లోర్‌థలిడోన్‌, అమ్లోడిపిన్‌, టెల్మిసార్టాన్‌ ట్యాబ్లెట్‌, మెటోప్రోలాల్‌ సక్సినేట్‌, సిల్నిడిపిన్‌, రొసువాస్టాటిన్‌, క్లోపిడోగ్రెల్‌ కేప్సూల్‌.. తదితర 23 రకాల ఔషధాల ధరలను సవరించినట్లు ఎన్‌పీపీఏ పేర్కొంది.

ఈ ఔషధాలను ఉత్పత్తి చేసి దేశీయ మార్కెట్‌కు అందిస్తున్న ఔషధ కంపెనీల్లో.. ఇప్కా ల్యాబ్స్‌, వోకార్డ్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌, లుపిన్‌, మైక్రో ల్యాబ్స్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌, అరిస్టో ఫార్మా, విండ్లాస్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు మాస్కాట్‌ హెల్త్‌ సిరీస్‌తో కలిసి అరిస్టో ఫార్మా ఉత్పత్తి చేస్తున్న విదాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌ హైడ్రోక్లోరైడ్‌ (ఎస్‌ఆర్‌) ట్యాబ్లెట్‌కు తాజాగా రూ.6.86 ధరను ఎన్‌పీపీఏ నిర్ణయించింది. అదేవిధంగా వోకార్డ్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేస్తున్న ఎరిత్రోపోయటిన్‌ ఇంజెక్షన్‌ (20,000 ఐయూ, ఆర్‌-డీఎన్‌ఏ ఆరిజన్‌) ప్యాక్‌ ధరకు రూ.2,054 ధర ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ మందు ధర ఎంతో అధికంగా ఉంది. ఇప్కా ల్యాబ్స్‌కు చెందిన మెథోట్రెక్సేట్‌ టాపికల్‌ జెట్‌, సన్‌ ఫార్మా విక్రయిస్తున్న లెవిటిరాసెటమ్‌ సోడియం క్లోరైడ్‌ ఇంజెక్షన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన క్లోర్‌థలిడోన్‌, అమ్లోడిపిన్‌, టెల్మిసార్టాన్‌ ట్యాబ్లెట్‌, లుపిన్‌ ఔషధం మెటోప్రోలాల్‌ సక్సినేట్‌ తదితర ఔషధాలకు ఎన్‌పీపీఏ ధరలు నిర్ణయించింది.

Read Also…  Modular Hospital: రికార్డు సొంతం చేసుకున్న ఒంగోలు జీజీహెచ్.. 30 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి!