Indian Railways: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. ఇకపై రిజర్వేషన్ లేకున్నా ప్రయాణించవచ్చు.!
Indian Railways: కరోనా కారణంగా దశలవారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతూ వస్తోంది రైల్వే శాఖ. ప్రయాణీకుల రద్దీ, పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని..
కరోనా కారణంగా దశలవారీగా స్పెషల్ ట్రైన్స్ నడుపుతూ వస్తోంది రైల్వే శాఖ. ప్రయాణీకుల రద్దీ, పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వాటి సంఖ్య పెంచుతూపోతోంది. అయితే ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణించవచ్చు. కానీ మున్ముందు రిజర్వేషన్ చేయించుకోకపోయినా.. ప్రయాణీకులు ప్రయాణించే విధంగా ఇండియన్ రైల్వేస్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అన్-రిజర్వుడ్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నాయి. పండగ సీజన్ దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. మొదటిగా ఈ రైళ్లను నార్తెన్ రైల్వేస్‌లో ప్రారంభిస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి షమ్లి, ఢిల్లీ, షాదారా, ప్రయాగరాజ్ సంగం, ఫైజాబాద్, జౌన్‌పూర్ మధ్య అన్-రిజర్వుడ్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరగనున్నాయి. వారంలో ఆరో రోజుల పాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ ట్రైన్స్‌లో కరోనా నిబంధనలను యధాతధంగా అమలవుతాయని ఉత్తర రైల్వే అధికారి దీపక్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో కూడా అన్-రిజర్వుడ్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.
- 01650/49 – షమ్లి-ఢిల్లీ షాదారా-షమ్లి(మెయిల్ స్పెషల్ ట్రైన్) – వారంలో ఆరు రోజులు(ఆదివారం మినహా) అక్టోబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు నడవనుంది.
- 04381/82 – ప్రయాగరాజ్ సంగం-ఫైజాబాద్-ప్రయాగరాజ్ సంగం(మెయిల్ స్పెషల్ ట్రైన్) – వారంలో ఆరు రోజులు(ఆదివారం మినహా) అక్టోబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు నడవనుంది.
- 04383/54376 – ప్రయాగరాజ్ సంగం – జౌన్‌పూర్ – ప్రయాగరాజ్ సంగం(మెయిల్ స్పెషల్ ట్రైన్) వారంలో ఆరు రోజులు(ఆదివారం మినహా) అక్టోబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు నడవనుంది.
- 04245/04246 – ప్రయాగరాజ్ సంగం- జౌన్‌పూర్-ప్రయాగరాజ్ సంగం(మెయిల్ స్పెషల్ ట్రైన్) వారంలో ఆరు రోజులు(ఆదివారం మినహా) అక్టోబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు నడవనుంది.
Also Read:
ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..
చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!
‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!
ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!