AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌.. ప్రతిరోజు మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలుసా..! ఆశ్చర్యపోతారు..

Plastic: ప్రతి వ్యక్తి ఆహారంతో పాటు ప్లాస్టిక్ తింటున్నాడని చెబితే వింతగా అనిపిస్తోంది కావొచ్చు కానీ ఇది వాస్తవం. ప్రతి రోజు, ప్రతివారం, ప్రతి నెల మీరు ఎంత ప్లాస్టిక్

షాకింగ్‌.. ప్రతిరోజు మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలుసా..! ఆశ్చర్యపోతారు..
Plastic
uppula Raju
|

Updated on: Sep 29, 2021 | 3:43 PM

Share

Plastic: ప్రతి వ్యక్తి ఆహారంతో పాటు ప్లాస్టిక్ తింటున్నాడని చెబితే వింతగా అనిపిస్తోంది కావొచ్చు కానీ ఇది వాస్తవం. ప్రతి రోజు, ప్రతివారం, ప్రతి నెల మీరు ఎంత ప్లాస్టిక్ తింటున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో అందరికి తెలుసు. అటువంటి ప్లాస్టిక్ శరీరంలోకి ఎలా వెళుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. DW నివేదిక ప్రకారం.. ప్లాస్టిక్ అనేది గాలి, నీరు, ఆహారంలో కరిగి ఉంటుంది.

ప్రతి వారం మీరు ఐదు గ్రాముల మైక్రోప్లాస్టిక్ తింటున్నారు. అంటే క్రెడిట్ కార్డుకు సమానమైన ప్లాస్టిక్ అని అర్థం. రాయిటర్స్ ప్రకారం.. ఫైర్‌మెన్‌ హెల్మెట్ తయారీకి ఎంత ప్లాస్టిక్ అవసరమో అంత ప్లాస్టిక్‌ మీరు సంవత్సరంలో తింటున్నారు. అంటే మనం ప్రతి 10 సంవత్సరాలకు 2.5 కిలోల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ని తింటున్నాం. అటువంటి పరిస్థితిలో మీ జీవితమంతా మీరు ఎంత ప్లాస్టిక్ తింటారో ఊహించవచ్చు. ఈ నివేదిక ప్రకారం ఒక జీవితమంతా మనం 20 కిలోల వరకు ప్లాస్టిక్ తింటామని అంచనా.

ప్లాస్టిక్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రకారం.. ప్లాస్టిక్ తాగునీటి నుంచి ఆహార పదార్థాల వరకు అన్నిటి ద్వారా శరీరంలోకి వెళుతుందని నివేదించింది. గాలిలో కూడా ప్లాస్టిక్ కరిగి ఉంటుందని తెలిపింది. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంతేకాదు మీ జీర్ణవ్యవస్థని దెబ్బతీస్తుంది.

మనిషి చెత్తను వ్యాప్తి చేస్తున్నాడు ప్రపంచంలోని ప్యాకేజింగ్‌లలో మూడింట ఒక వంతు ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. జర్మనీలో ప్రతి వ్యక్తి 38 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. అదే సమయంలో ఐరోపాలో ప్రతి వ్యక్తి 24 కిలోల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. మీరు ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారో అంతే మొత్తంలో ప్లాస్టిక్ వాడకం కూడా పెంచుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు శతాబ్దాలుగా కరగడం లేదు. అందువల్ల ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా ధ్వంసం కావడానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని అనేక నివేదికలలో వెల్లడైంది. ప్లాస్టిక్ కవర్లు నాశనం కావడానికి 500 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి, మీ ఆరోగ్యానికి చాలా హానికరం.

Skin Care: మీ ముఖం మీద అవాంఛిత పుట్టుమచ్చలు ఉన్నాయా.. వాటిని తొలిగించుకునేందుకు ఇంట్లోనే ఇలా చేయండి..

Muslim Woman Krishna Painting: నెరవేరిన ఆరేళ్ల కల.. శ్రీకృష్ణుడికి ముస్లిం యువతి బహుమతి.. ఏమిటది?

Dope Test: డీజీసీఏ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా డోప్‌ టెస్ట్‌.. ఉత్తర్వులు జారీ