Viral Video: జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లారు.. కానీ వారు ఊహించనిది జరిగింది.. ఇంతకీ ఏం జరిగింది?
మనం ఊహించన ఘటనలు జరినప్పుడు ఆశ్చర్యపోతాం. ఇలానే ఓ మత్స్యకారుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను ఊహించని ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిదంటే...
మనం ఊహించన ఘటనలు జరినప్పుడు ఆశ్చర్యపోతాం. ఇలానే ఓ మత్స్యకారుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను ఊహించని ఘటన జరిగింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. అతను చేపల వేటకు వెళ్తే పెద్ద చేప అతడి వలకు చిక్కింది. అది మామూలు చేప కాదు సొరచేప. ఆ సొరచేపను పట్టడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చిందని అతడు చెప్పాడు.
సైమన్ డేవిడ్సన్ అనే మత్స్యకారుడు తన సహచరులతో కలిసి చేపల వేట కోసం సముద్రంలోకి బయలుదేరాడు. వారు వేటకు బయల్దేరిన రెండో ఇల్ఫ్రాకోంబే సమీపంలోని డెవాన్ తీరానికి ఏడు మైళ్ల దూరంలో ఏడు అడుగుల సొరచేపను వారు పట్టుకున్నారు. తన వలకు సొరచేప చిక్కుతుందని అనుకోలేదని సైమన్ చెప్పారు. జెయింట్ సొరచేపను పడవలోకి నెట్టడానికి గంటకు పైగా కష్టపడ్డామన్నారు. ఇదీ తమ జీవితంలో పెద్ద వేటగా పేర్కొన్నాడు.
సొరచేప వలకు చిక్కిన తర్వాత 600 మీటర్ల లాగామన్నారు. ఒక గంట శ్రమించిన తర్వాత విజయం సాధించారు. కొలత తీసుకున్న తరువాత చేప ఏడు అడుగులు ఉన్నట్లు డేవిడ్సన్ చెప్పారు. కొలతలు తీసుకోవడం పూర్తయిన తర్వాత సొరచేపను సురక్షితంగా సముంద్రంలోకి వదిలాడు. ఇది బ్రిటిష్ సముంద్ర అతిపెద్ద వేటగా నిలిచింది. ఇది రికార్డుగా . వీరి కంటే ముందు1993లో స్కాట్స్ మత్స్యకారుడు క్రిస్ బెన్నెట్ పెద్ద సొరచేపను పట్టుకున్నారు. అయితే, డేవిడ్సన్ రికార్డును అధికారింగా నమోదు చేయరు. ఎందుకంటే చేపను పట్టుకుని వచ్చి దాన్ని తూకం వేస్తేనే నమోదు చేస్తారు.
Read Also.. China Army: హద్దులు దాటుతున్న చైనా సైన్యం.. భారత సరిహద్దుల్లో వంతెన పడగొట్టిన వైనం!