చలికాలంలో ఈ బ్రేక్‏పాస్ట్స్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అవేంటంటే.. 

శీతకాలంలో మన రోజూవారీ అలవాట్లు మారుతుంటాయి. ఈ సీజన్లో ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి

చలికాలంలో ఈ బ్రేక్‏పాస్ట్స్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. అవేంటంటే.. 
Breakfast

శీతకాలంలో మన రోజూవారీ అలవాట్లు మారుతుంటాయి. ఈ సీజన్లో ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. కానీ.. ప్రతిసారీ ఆహారం చల్లగా ఉండడం వలన చిన్నపిల్లలతోపాటు.. పెద్దవారు కూడా ఆహారం పై అయిష్టత చూపిస్తుంటారు. చలికాలంలో శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అందుకు మీరు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పలు ఉండాలి. ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉదయం చలి ఎక్కువగా ఉండడం వలన చాలా మంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా కాకుండా.. ఈ సీజన్‏లో శరీరాన్ని వెచ్చగా ఉంచే అల్పాహారాన్ని తీసుకోవాలి. అవేంటంటే..

* ఓట్స్ పాలక్ పరోటా.. ఓట్స్.. బచ్చలి కూర పరోటా చలికాలంలో మంచి బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా ఇది షుగర్ పేషెంట్స్ కు మేలు చేస్తుంది.
* రాగి కి ఖీర్.. రాగి ఖీర్ రుచి చాలా బాగుంటుంది.దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా పోషకమైనది కూడా. చలికాలంలో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* అందే కి భుర్జీ పరాఠా – నాన్ వెజ్ తిననివారు గుడ్డు భుర్జీ పరాఠాను అల్పాహారంలో తినవచ్చు. ఇది ఎనర్జీ బూస్టర్‌గా ఉండటమే కాకుండా ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్పాహారానికి ఇది సరైన ఆహార పదార్థం.
* ముల్లంగి కా రైతా – చలికాలంలో హెవీ బ్రేక్‌ఫాస్ట్. సాధారణంగా ఉదయాన్నే తీసుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
* యాపిల్ స్మూతీ – రోజూ యాపిల్ ఫ్రూట్ తినాలని వైద్యులు చెబుతుంటారు. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. నేరుగా యాపిల్ తినని వారు స్మూతీగా మార్చి తీసుకోవచ్చు. ఇది శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది.
* నమ్‌కీన్ దాలియా – దాలియా తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటుంది. చలికాలంలో ఇది బెస్ట్ ఫుడ్. నమ్కీన్ గంజి జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది అలాగే బరువు పెరగకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి.

Also Read: Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..

Jr.NTR: తనయులతో ఫారిన్‏లో ఎన్టీఆర్ సందడి.. చిన్న కొడుకుతో తారక్ దంపతులు.

Click on your DTH Provider to Add TV9 Telugu