Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..

టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఆయన స్పృహలో..

Kaikala Satyanarayana: వదంతులు నమ్మొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కూతురు..
Kaikala Satyanarayana
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 23, 2021 | 12:17 PM

టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.  ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఆయన స్పృహలోకి వచ్చినట్లుగా వెల్లడించారు. రక్తపోటు తగ్గిందని.. కిడ్నీ పనితీరు మెరుగుపడిందని పేర్కొన్నారు. వెంటిలేటర్ మద్దతును నెమ్మదిగా తగ్గిస్తున్నామన్నారు. ఈరోజు GI ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదని.. రోగి  ICUలో ఉన్నారని తెలిపారు. కనీస మద్దతుతో పరిస్థితి మెరుగుపడుతోందని అన్నారు. త్వరలో మరింత ఆరోగ్యంగా మారుతారని హెల్త్ బులిటన్‌లో పేర్కొన్నారు.

ఇక  కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు రమాదేవి స్పందించారు. మీడియాకు ఆడియో టేపును పంపించారు. వేగంగా   కోలుకుంటున్నారని.. ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు. అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని.. దయచేసి అనవసర వార్తలను ప్రచారం చేయవద్దని అన్నారు. తప్పుడు వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురిచేస్తాయన్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారు – కైకాల సత్యనారాయణ కూతురు 

విలన్‌గా వికటాట్టహాసం చేసినా, క్యారెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా అది కైకాల స‌త్యనారాయ‌ణ‌కే చెందుతుంది. దాదాపు ఆరు ద‌శాబ్ధాలుగా ప్రేక్షకుల‌ని అల‌రించిన ఆయ‌న.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవలే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరు త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు.. సొంత అల్లుడిపైనే అనుమానాలు..

Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..