AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Diet: వింటర్ సీజన్‌లో ఈ ఐదు డ్రింక్స్ తాగితే బోలడన్ని లాభాలు.. అవేంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి చిందేస్తోంది.  ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, గొంతునొప్పి మొదలైన అనేక వ్యాధులు వస్తాయి. ఈ కారణంగా అటువంటి కాలానుగుణ వ్యాధులను నివారించడానికి..

Winter Diet: వింటర్ సీజన్‌లో ఈ ఐదు డ్రింక్స్ తాగితే బోలడన్ని లాభాలు.. అవేంటంటే..
Healthy Drinks
Sanjay Kasula
|

Updated on: Nov 23, 2021 | 2:16 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి చిందేస్తోంది.  ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, గొంతునొప్పి మొదలైన అనేక వ్యాధులు వస్తాయి. ఈ కారణంగా అటువంటి కాలానుగుణ వ్యాధులను నివారించడానికి ఇంట్లోనే కొన్నింటిని తయారు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి పోషకాహారం, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా, అల్లం, దాల్చినచెక్క, లవంగం మొదలైన ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. దేశీయ మూలికలు, మసాలా దినుసులు పాలతో కలిపి వివిధ రకాల ఆరోగ్యకరమైన పానీయాలను తయారు చేయవచ్చు. చలికాలంలో మీకు విశ్రాంతిని అందించడానికి అవి పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మారుతున్న సీజన్లలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో ఏ పానీయాలను చేర్చుకోవచ్చో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచడానికి 5 ఆరోగ్యకరమైన..

మసాలా టీ

మసాలా చాయ్ తాగితే దాని రుచి తెలుస్తుంది. అదీ చలికాలంలో మరింత అద్భుతంగా ఉంటుంది. ఇందులో లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, బే ఆకులు, జాజికాయ మొదలైన సుగంధ ద్రవ్యాలను కలిసి తయారు చేస్తారు. ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు మసాలా చాయ్‌లో పాలు జోడించవచ్చు లేదా జోడించకపోవచ్చు.

కహ్వా

మసాలా చాయ్ మరొక రూపం.. కహ్వా. ఇది ప్రత్యేకించి కశ్మీర్‌లో చాలా ఫేమస్. కహ్వా కాశ్మీరీ వంటకాలలో ఒక సాంప్రదాయ పానీయం. ఇది గ్రీన్ టీ, బాదం, కుంకుమపువ్వు, ఏలకులు, దాల్చిన చెక్క మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇది కాలానుగుణ మార్పులతో పోరాడటానికి మీకు సహాయం చేస్తుంది.

కషాయాలతో..

శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో భాగమైన ఈ ఆరోగ్యకరమైన పానీయంను తయారు చేస్తున్నారు. దీనిని హెర్బల్ టీ అని కూడా అంటారు. ఇది అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాల పోషకమైన మిశ్రమం. ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి డికాషన్ మంచి మందు. ఇది సీజనల్ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులను నయం చేయడంలో సహాయపడే ఒక ఆయుర్వేద హోం రెమెడీ.

కుంకుమపువ్వు పాలు

కేసర్ పాలు ఆరోగ్యకరమైన రుచికరమైన పానీయం. ఇది చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పాలు, కుంకుమపువ్వుతో పాటు ఏలకులు, పిస్తా, బాదంపప్పులను కూడా ఈ పానీయంలో చేర్చుకోవచ్చు.

కంజి

కంజి ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పానీయం. ఇది క్యారెట్, బీట్‌రూట్ నుండి తయారవుతుంది. దీని రుచి కారంగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, ఔషధ మూలికల మిశ్రమంతో, కంజీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ శీతాకాలంలో మీరు ఈ పానీయాన్ని ప్రయత్నించవచ్చు.

ఇవి కూడా చదవండి: YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సంచలన నిజాలు.. సొంత అల్లుడిపైనే అనుమానాలు..

Winter Makeup Tips: కాలం మారింది.. మేకప్ కిట్‌లో ఈ నాలుగు మార్పులు చేసుకోండి..