ప్రెజర్ కుక్కర్ కొనాలని ఆలోచిస్తున్నారా..! అయితే జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోండి..
Pressure Cooker: మీరు ప్రెషర్ కుక్కర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. నాసిరకం ప్రెషర్ కుక్కర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బిఐఎస్ ప్రమాణాలను
Pressure Cooker: మీరు ప్రెషర్ కుక్కర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. నాసిరకం ప్రెషర్ కుక్కర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బిఐఎస్ ప్రమాణాలను ఉల్లంఘించే ఈ-కామర్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, పేటిఎమ్ మాల్ ఉన్నాయి. నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను పరిశోధించడానికి CCPA ఇప్పటికే దేశవ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్‌లకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
BIS స్టాండర్డ్ మార్క్ ఉండాలి ప్రకటన ప్రకారం.. జనవరి 21, 2020న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2020ని ఉల్లంఘించి ప్రెజర్ కుక్కర్‌లను విక్రయించిన ఈ -కామర్స్ సంస్థలపై కేసులను CCPA స్వయంచాలకంగా పరిగణలోకి తీసుకుంది. ఆర్డర్ ప్రకారం దేశీయ ప్రెషర్ కుక్కర్‌లు ఇండియన్ స్టాండర్డ్ IS 2347:2017కి అనుగుణంగా ఉండాలి.1 ఆగస్ట్ 2020 నుంచి అమలులోకి వచ్చే BIS నుంచి లైసెన్స్ కింద స్టాండర్డ్ మార్క్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.
వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) రూల్స్, 2020లోని రూల్ 4(2) ప్రకారం.. ఏ ఈ-కామర్స్ సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లో లేదా మరేదైనా వ్యాపారంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో విక్రయాలు జరపకూడదని తెలిపింది. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 7 రోజుల్లోగా CCPA ఈ-కామర్స్ సంస్థల నుంచి అభిప్రాయాన్ని కోరినట్లు ప్రకటన పేర్కొంది. నాసిరకం కుక్కర్లు విక్రియించినట్లు తేలితే వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం అవసరమైన చర్య తీసుకోవచ్చు.