AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Fruit : పోషకాల గని ఈ పండు..! రైతులకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది.. ఎలాగో తెలుసుకోండి..

Kiwi Fruit : కివీ పండు చైనా నుంచి ఉద్భవించింది. ఇది చైనా అడవులలో సహజంగా పండుతుంది. దీని సాగు దాదాపు 7 దశాబ్దాల క్రితం న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది.

Kiwi Fruit : పోషకాల గని ఈ పండు..! రైతులకు కూడా లాభాలు తెచ్చిపెడుతోంది.. ఎలాగో తెలుసుకోండి..
Kiwi Fruit
uppula Raju
|

Updated on: Jul 31, 2021 | 7:58 PM

Share

Kiwi Fruit : కివీ పండు చైనా నుంచి ఉద్భవించింది. ఇది చైనా అడవులలో సహజంగా పండుతుంది. దీని సాగు దాదాపు 7 దశాబ్దాల క్రితం న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. న్యూజిలాండ్ జాతీయ పక్షి పేరు మీద దీనికి కివి అని పేరు పెట్టారు. భారతదేశ రైతులు కూడా కివి పండు సాగు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలతో నిండి ఉన్నందున దీనికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. కివి పండు సముద్ర మట్టానికి 1200 నుంచి1500 మీటర్ల ఎత్తులో భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో పండుతుంది.

ఆపిల్‌లకు మంచి ప్రత్యామ్నాయం. కివి సాగులో గొప్పదనం ఏమిటంటే దీనికి రసాయన ఎరువులు లేదా పురుగుమందులు అవసరం లేదు. ఇప్పటి వరకు భారతదేశంలో కివి పండులో ఎలాంటి వ్యాధి కనిపించలేదు. కివి పండ్ల మొక్కలకు అనుకూలమైన వాతావరణం లభిస్తే దాని మొక్కల సగటు వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. కివి మొక్క మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో పండ్లు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ పండ్లను అడవి జంతువులు కూడా ఏమి చేయవు. కివీ పండ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదు. కివి పండును ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. కివి రెండు నుంచి మూడు నెలలు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంటే 6 నెలలు వరకు తాజాగా ఉంటుంది.

కివీ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కివి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మామిడి కంటే మూడు రెట్లు ఎక్కువ. విటమిన్ సి తో పాటు కివిలో విటమిన్ ఎ, ఇ, కె కూడా ఉంటుంది. అరటిలో కంటే కివిలో ఎక్కువ పొటాషియం కనిపిస్తుంది. ఇది రక్త ప్రవాహం, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది. కివిలో ఉండే పోషకాల కారణంగా దీనిని పండ్లలలో రాజుగా భావిస్తారు.

Andhra Pradesh: రామప్పకు యునెస్కో గుర్తింపు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్..!

JC Vs Pedda Reddy: తాడిపత్రి వార్: తాజాగా పెట్టిన కొత్త కేసుపై సంచలన కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

గర్భిణీ స్త్రీలు బాదం పప్పును ఏ సమయంలో తినాలో తెలుసా.. ఎలా తీసుకుంటే మంచిదంటే..