Weight Loss : బరువు తగ్గేందుకు 5 చిట్కాలు.. కొన్ని వారాల్లోనే ఫలితం చూసి వాహ్ అనాల్సిందే
బరువు తగ్గడం అంత ఈజీ కాదు. దీని కోసం నిరంతర వ్యాయామాలతోపాటు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే కొన్ని వారాల్లోనే మీరు పొట్ట చుట్టూ పేరుకపోయిన కొవ్వును తగ్గించేందుకు కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.
బరువు తగ్గడం అంత ఈజీ కాదు. దీని కోసం నిరంతర వ్యాయామాలతోపాటు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే కొన్ని వారాల్లోనే మీరు పొట్ట చుట్టూ పేరుకపోయిన కొవ్వును తగ్గించేందుకు కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలని చాలా మంది కల కంటుంటారు. ఇది అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి నిదర్శంగా మారుతుంది. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు.
స్కిప్పింగ్ స్కిప్పింగ్‌తో శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కిప్పింగ్ మన శరీరానికి చక్కని వ్యాయామం అందిస్తుంది. ఎప్పుడైనా ఈ వ్యాయామం చేయవచ్చు. దీని కోసం మీకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. స్కిప్పింగ్ తాడు ఉంటే చాలు. దీనితో బాడీ మొత్తానికి మంచి వ్యాయమం దొరుకుతుంది. అలాగే మన శరీరంలోని కొవ్వు కరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది.
వర్కౌట్ బ్యాండ్ వర్కౌట్ బ్యాండ్‌ల సహాయంతో మీరు చాలా కాలం పాటు కఠిన వ్యాయామాలు కూడా చేయవచ్చు. స్క్వాట్స్, సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఈ బ్యాండ్‌ను ఉపయోగించవచ్చు. స్ట్రెచింగ్, ట్రైనింగ్, ఇతర వ్యాయామాల కోసం రెసిస్టెన్స్ బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు. వీటి సహాయంతో కొవ్వును త్వరగా కరిగించవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్‌లో పొటాషియం, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ విషపూరితమైన, హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం, ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి చక్కగా సహాయపడుతుంది. దీనిలో కేలరీల పరిమాణం చాలా తక్కువ. ఇది మీ పొట్టను ఎక్కువ కాలం నిండి ఉన్నట్లు అనిపించడంతోపాటు , చక్కెర స్థాయిని కాపాడుతుంది.ఆపిల్ సైడర్ వెనిగర్ తాగే ముందు తప్పకుండా డైల్యూట్ చేయాలి.
తక్కువ ఉప్పు.. ఉప్పు నీటి నిలువను పెంచుతుంది. దీన్ని తగ్గించడానికి ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. ఆహారంలో రుచిని పెంచడానికి మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. ఇవి శరీరం నుంచి అదనపు నీటిని తొలగించేందుకు సహాయపడతాయి.
సర్క్యూట్ శిక్షణ స్ట్రెచింగ్, ఆ తర్వాత ఏరోబిక్, స్ట్రెంగ్త్ వ్యాయామాలు, జాగింగ్, విశ్రాంతితోపాటు ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తిచేసేలా ఒంటికి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. సర్క్యూట్ ట్రైనింగ్‌తో శరీరానికి మంచి వ్యాయమం దొరుకుతుంది. అలాగే కొవ్వును కూడా కరించుకోవచ్చు. ఇందులో పుష్ అప్‌లు, లంగ్స్, పుల్ అప్‌లు, స్కిప్పింగ్ కూడా ఉంటాయి. వారమంతా ఈ వ్యాయమం చేయడం ద్వారా 500 నుంచి 600 కేలరీలను కరిగించుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలు బాదం పప్పును ఏ సమయంలో తినాలో తెలుసా.. ఎలా తీసుకుంటే మంచిదంటే..
White Hair Tips : తెల్ల జుట్టు తగ్గించడానికి అద్భుతమైన 6 చిట్కాలు..! ఇంట్లోనే ప్రయత్నించి చూడండి..