AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Hair Tips : తెల్ల జుట్టు తగ్గించడానికి అద్భుతమైన 6 చిట్కాలు..! ఇంట్లోనే ప్రయత్నించి చూడండి..

White Hair Tips : నేటి ప్రపంచంలో తెల్లజుట్టు అందరిని వేదించే అతి పెద్ద సమస్య. 20 సంవత్సరాలు పూర్తికాకముందే జుట్టు మొత్తం నెరిసిపోతుంది. దీనికి అనేక

White Hair Tips : తెల్ల జుట్టు తగ్గించడానికి అద్భుతమైన  6 చిట్కాలు..! ఇంట్లోనే ప్రయత్నించి చూడండి..
White Hair Tips
uppula Raju
|

Updated on: Jul 31, 2021 | 8:04 PM

Share

White Hair Tips : నేటి ప్రపంచంలో తెల్లజుట్టు అందరిని వేదించే అతి పెద్ద సమస్య. 20 సంవత్సరాలు పూర్తికాకముందే జుట్టు మొత్తం నెరిసిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యు లోపం వల్ల కొంతమందికి జుట్టు తెల్లబడుతుంది. మరికొంతమందికి ఒత్తిడి సమస్య ద్వారా, పొంతన లేని ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు తెల్లబడుతుంది. దీంతో అందరు డై వేసుకొని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇంట్లోనే ఈ 6 పద్దతుల ద్వారా తెల్లజుట్టు సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎలాగో ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఆమ్లా పౌడర్ ఇనుప పాత్రలో1 కప్పు ఆమ్లా పౌడర్ వేసి 500 మి.లీ కొబ్బరి నూనె అందులో వేసి మంట మీద నెమ్మదిగా 20 నిమిషాలు వేడి చేయండి. దానిని చల్లబరచండి. గాలి చొరబడని ఒక సీసాలో వడకట్టండి. దీన్ని వారానికి రెండుసార్లు హెయిర్ మసాజ్‌గా ఉపయోగించండి.

2. కరివేపాకు ఆకులు కరివేపాకు ఆకులను తీసుకొని 2 స్పూన్ల ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల బ్రాహ్మీ పౌడర్‌తో కలిపి రుబ్బాలి. దీన్ని హెయిర్ మాస్క్‌గా జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి తేలికపాటి మూలికా షాంపూతో శుభ్రం చేయండి.

3. ఇండిగో, హెన్నా ఇండిగో జుట్టుకు రంగు వేయడానికి ప్రాచీన కాలం నుంచి ఉపయోగించే సహజ రంగు. హెన్నాతో కలిపి వాడటం వల్ల జుట్టు నల్లటి రంగును పొందేలా చేస్తుంది.

4. కొబ్బరి నూనె కొబ్బరి నూనె, నిమ్మరసం జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఈ రెండింటి కలయిక ఒక రసాయన ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇది కొంత కాలానికి జుట్టును సహజంగా నల్లగా చేస్తుంది.

5. బ్లాక్ టీ నల్లటి జుట్టును నివారించడంలో సహాయపడే మరొక ప్రభావవంతమైన పదార్ధం బ్లాక్ టీ. మీరు బ్లాక్ టీ ఆకులను 2 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. నిమ్మరసంతో మిక్స్ చేసి జుట్టును శుభ్రం చేయడానికి ముందు 40 నిమిషాల పాటు హెయిర్ మాస్క్ లాగా అప్లై చేయండి.

6. మూలికా మిశ్రమం తయారు చేయండి.. 1 టీస్పూన్ ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల బ్లాక్ టీ, 1 టీస్పూన్ స్ట్రాంగ్ కాఫీ, 1/2 అంగుళాల కత్తా, 1 వాల్నట్ బెరడు ముక్క, 1 టీస్పూన్ ఇండిగో, 1 టీస్పూన్ బ్రాహ్మీ పౌడర్, 1 స్పూన్ త్రిఫల తీసుకోండి. 2 లీటర్ల నీరు మంట మీద నెమ్మదిగా 30 నిమిషాలు కాచండి. చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో వడకట్టండి. షాంపూ చేయడానికి ముందు 30 నిమిషాల పాటు అప్లై చేయండి. కొన్ని రోజుల్లోనే మీ జుట్టు రంగులో తేడా చూస్తారు.

AP Cabinet : ఆగస్టు 6న సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై చర్చలు

Post Office MIS Scheme : కేవలం రూ.50,000 ఇన్వెస్ట్ చేసి నెలకు రూ. 3300 పెన్షన్ పొందండి..!

Hyderabad Bonalu: కార్వాన్ దర్బార్ మైసమ్మ ఉత్సవాలకి భారీ బందోబస్తు.. సిటీలో రేపటి వేడుకలు ఎక్కడెక్కడ.? ఎలా.?