Health Tips: మన పరిసరాల్లో ఉండే ఈ పువ్వులు వ్యాధులను తగ్గిస్తాయట.. ఎలా ఉపయోగించాలంటే..
అందమైన పువ్వులను చూస్తే...వెంటనే మన చేతుల్లోకి తీసేసుకుంటాం. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా
అందమైన పువ్వులను చూస్తే…వెంటనే మన చేతుల్లోకి తీసేసుకుంటాం. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అందమైన పువ్వులు చూశారంటే.. అతివల జడలో ఉండాల్సిందే. అలాగే మన భారత దేశంలో పువ్వులను దేవుడి పటాలపైన కాకుండా.. పలు కార్యక్రమాల్లోనూ వినియోగిస్తుంటాము. ముఖ్యంగా పువ్వులను ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల పువ్వులు వ్యాధులను నయం చేస్తాయని అంటుంటారు. కొన్ని పువ్వులలో ఉంటే పోషకాలను పలు ఔషదాలలో ఉపయోగిస్తారు. సీజనల్ వ్యాధులను తగ్గించడమే కాకుండా.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. కుంకుమ పువ్వు, గులాబీలు వంటి పువ్వులు పలు ఔషదాలలో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని పువ్వులు కూడా వ్యాధులను నయం చేసే ప్రభావం ఉందట. అవెంటో తెలుసుకుందామా.
గులాబీలు.. గులాబీ పువ్వులలో టానిన్లు, విటమిన్ ఎ, బీ, సీ ఉంటాయి. గులాబీ పువ్వుల జ్యూస్ శరీరంలోని వేడిని, తలనొప్పిని తగ్గిస్తాయి. ఎండిన పువ్వులు గర్భిణీ స్త్రీలకు మూత్ర విసర్జన సమస్యలకు నయం చేస్తాయి. అలాగే వాటి రేకులు కడుపు సమస్యలను తగ్గిస్తాయి. గులాబీలను మురబ్బా వంటి స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు. అలాగే దగ్గు, ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి ఉపరితిత్తుల సమస్యలు, అజీర్ణ, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను నయం చేయడంలో సహయపడతాయి. రోజ్ వాటర్ వలన కళ్ల మంటను తగ్గించవచ్చు. మలబద్దకాన్ని కూడా నియంత్రించవచ్చు.
మందార పువ్వు.. సాధారంగా ఈ పువ్వులు జుట్టు సమస్యలనకు నివారిణిగా పని చేస్తుంది. ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు మరియు నారింజ రంగులలో ఉండే పువ్వులు, జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మందార పువ్వులను టీ ఆయుర్వేద టీ తయారీలో ఉపయోగిస్తారు. ఇది రక్తపోటును తగ్గించడంలో సహయపడుతుంది. అలాగే పైల్స్, రక్తస్రావం, జుట్టు రాలడం, అధిక రక్తపోటు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మల్లె పువ్వులు.. మల్లె పువ్వులు సువాసనకు మానసిక ప్రశాంతత కలిగిస్తోంది. అలాగే మల్లె టీ.. ఆందోళన, నిద్రలేమి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సహయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలు, మహిళలలో పీరియడ్స్ పెయిన్, శరీరంలోని మంటను తగ్గించడంలో సహయపడతాయి.
Also Read: Allu Arha: అల్లు అర్హ క్యూట్ వీడియో షేర్ చేసిన స్నేహా రెడ్డి.. బన్నీ డాటర్ ఏం చేస్తుందో చూశారా..
Sarkaru Vaari Paata: బాబు ల్యాండ్ అయ్యాడు… అసలైన పండగ అప్పుడే.. అభిమానులకు పూనకాలే..