ఈ ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినకూడదు..! అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు

Food Overheating : రోజులో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే కొంతమందికి పదే పదే వేడి చేసి తినే అలవాటు ఉంటుంది. ఏ ఆహారాన్ని వేస్ట్ చేయవద్దనేది వారి ఉద్దేశ్యం. కానీ కొన్ని

ఈ ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినకూడదు..! అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు
Cooking

Food Overheating :  రోజులో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే కొంతమందికి పదే పదే వేడి చేసి తినే అలవాటు ఉంటుంది. ఏ ఆహారాన్ని వేస్ట్ చేయవద్దనేది వారి ఉద్దేశ్యం. కానీ కొన్ని ఆహార పదార్థాలను రీహీట్ చేసి తినడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు
పాలకూర మొదలైన ఆకుపచ్చ కూరగాయల ఆహారం మిగిలిపోతే వాటిని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. వాస్తవానికి పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీరు వాటిని పదే పదే వేడి చేసినప్పుడు అవి ఆక్సిడైజ్ అవుతాయి. ఐరన్ ఆక్సీకరణ అనేది చాలా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అన్నం విషయంలో జాగ్రత్త
వండిన అన్నంలో కొన్ని బీజాంశాలు కనిపిస్తాయి. అవి శరీరానికి హానికరం కాదు. కానీ అన్నం ఉడికిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అలా చేస్తే అది బ్యాక్టీరియాగా మారుతుంది. ఇది మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది.

గుడ్లు తినకూడదు
గుడ్లలో ప్రోటీన్ చాలా ఉంటుది కానీ వాటిని పదే పదే వేడి చేయకూడదు. గుడ్లు వండిన తర్వాత వీలైనంత త్వరగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే చల్లగా ఉన్నప్పుడు తినవచ్చు కానీ వేడి చేయకూడదు. ఇలా చేస్తే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చికెన్
మిగిలిన చికెన్ ను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. దీనివల్ల దానిలో చాలా మార్పులు సంభవిస్తాయి. ప్రోటీన్ కూర్పు పూర్తిగా మారుతుంది. అలాగే మళ్లీ వేడిచేసిన చికెన్ తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులను కూడా వంట చేసిన వెంటనే తినేయాలి. మష్రూమ్‌ను మరుసటి రోజు వరకు ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే ఇందులో మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగించే అనేక అంశాలు ఉంటాయి. పుట్టగొడుగులు మిగిలి ఉంటే వాటిని చల్లగా ఉన్నప్పుడు తినండి. కానీ వేడి చేయకూడదు.

Income Tax Return : మీ పేరుపై 3 ఇళ్లు ఉన్నాయా..! అయితే ఇన్‌కమ్‌టాక్స్‌ చెల్లించాల్సిందే..?

Priyamani: ‘నారప్ప’ సినిమాతో నా కోరిక నెరవేరింది.. నా ఫోటో కూడా అక్కడ ఉండాలి.. ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు..

Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ.. పుల్వామా దాడికి పాల్పడ్డ టెర్రరిస్ట్ హతం

Click on your DTH Provider to Add TV9 Telugu