Income Tax Return : మీ పేరుపై 3 ఇళ్లు ఉన్నాయా..! అయితే ఇన్‌కమ్‌టాక్స్ చెల్లించాల్సిందే..?
Income Tax Return : ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే తేదీ సమీపిస్తోంది. ఇంటి ఆస్తికి సంబంధించి ప్రజల మనస్సులో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో
Income Tax Return : ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే తేదీ సమీపిస్తోంది. ఇంటి ఆస్తికి సంబంధించి ప్రజల మనస్సులో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఒక వ్యక్తి పేరు మీద మూడు ఇళ్లు ఉన్నాయి ఆ ఇళ్లన్నింటిలో అతని కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఏ ఇల్లు కూడా అద్దెకు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో పన్ను చెల్లించాలా వద్దా అనేది తెలియాలి.
దీనికి సంబంధించి 2020-21 సంవత్సరానికి పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. నియమం ప్రకారం ఏ వ్యక్తి అయినా సొంత ఆస్తిగా రెండు ఇళ్లపై టాక్స్ మినహాయింపు పొందవచ్చు. కానీ ఒక ఇంటిపై ‘డీమ్డ్ లెట్ అవుట్’ ఆస్తిలో పరిగణిస్తారు. తదనుగుణంగా ఈ ఇంటికి పన్ను చెల్లించాలి. మీరు నివసించే రెండు ఇళ్లపై అద్దె ఆదాయం ఉన్నా పన్ను ఉండదు. కానీ మూడవ ఇల్లుపై కచ్చితంగా పన్ను చెల్లించాలని అధికారులు చెబుతున్నారు.
ఫామ్‌హౌస్ నియమాలు ఏమిటి మరొక ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తికి రెండు ఇళ్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫాంహౌస్. ఈ ఫాంహౌస్‌లోకి వారు వారాంతాల్లో వెళ్తారు. రెండవ ఇల్లు నగరంలో ఉంది అక్కడ వారు వారానికి 5 రోజులు ఉంటారు. అయితే రెండు ఆస్తులను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఎలా పరిగణిస్తుందంటే ఇందులో ఇల్లు స్వయం ఆక్రమణగా పరిగణిస్తారు. దానిపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. కానీ రెండవ ఇల్లు డీమ్డ్ లెట్ అవుట్ ఆస్తి కిందకు వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తోంది.
రెండు అంతస్తుల ఇంటి నియమం ఉదాహారణకు.. మొదటి అంతస్తులో యజమాని నివసిస్తుంటే గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకు ఇచ్చారని అనుకుందాం. పన్ను నియమాలు ఇందులో విభిన్నంగా ఉంటాయి. ఇందులో కింది అంతస్తు నుంచి సంపాదన వస్తోంది. దీని ప్రకారం మీరు పన్ను చెల్లించాలి. అయితే మొదటి అంతస్తు స్వీయ-ఆక్రమిత ఆస్తిగా పరిగణిస్తారు. పన్ను విధించరు.