Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు శుభవార్త..! నేరుగా ఇంటికి ఆన్‌లైన్ డెలివరీ..
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ స్కూటర్ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని అందరు అనుకుంటున్నారు.
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ స్కూటర్ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ క్లాస్ ఫీచర్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇదే సమయంలో దాని రైడ్, పనితీరును కస్టమర్‌లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఓలా.. టెస్లా మోడల్‌ని అనుసరిస్తుందని ఇక్కడ డీలర్ ఎవరు ఉండరని చెబుతోంది. కంపెనీ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుందని తెలుస్తోంది. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. చాలా మంది కస్టమర్‌లు స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో డెలివరీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. నేరుగా ఇంటికి అందించాలని ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్150 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. సిటీ రైడ్ కోసం దీనిని సిద్దం చేస్తున్నారని చెబుతున్నప్పటికీ రాబోయే కాలంలో దీనిని హైవే కోసం కూడా ఉపయోగించవచ్చు. ఓలా కంపెనీ మార్కెట్‌లోని ఇతర స్కూటర్లపై కూడా నిఘా పెడుతోంది. ఈ స్కూటర్ అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని ఇది అథర్ 450X, బజాజ్ చేతక్, TVS iQube ని కూడా అధిగమిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏథర్ 450X భారత మార్కెట్లో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 80 కి.మీ వేగంతో వెళుతుంది. బజాజ్ చేతక్, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు వరుసగా 70 kmph, 78 kmph వేగాన్ని కలిగి ఉంటాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 499 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0-50 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి దాదాపు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది.