Whatsapp Case: వాట్సాప్‌పై రష్యా సీరియస్‌.. చట్టపరమైన చర్యలకు పూనుకున్న ప్రభుత్వం. కారణమేంటంటే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 31, 2021 | 12:14 PM

Whatsapp Case: ఓవైపు సోషల్‌ మీడియా ఎంతలా అభివృద్ధి చెందుతుందో మరోవైపు దాని చుట్టూ వివాదాలు అలాగే చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా యూజర్ల డేటాను స్టోర్‌ చేసే విధానంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి....

Whatsapp Case: వాట్సాప్‌పై రష్యా సీరియస్‌.. చట్టపరమైన చర్యలకు పూనుకున్న ప్రభుత్వం. కారణమేంటంటే..
Whatsapp Case Russia

Whatsapp Case: ఓవైపు సోషల్‌ మీడియా ఎంతలా అభివృద్ధి చెందుతుందో మరోవైపు దాని చుట్టూ వివాదాలు అలాగే చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా యూజర్ల డేటాను స్టోర్‌ చేసే విధానంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఒక దేశానికి చెందిన యూజర్ల వ్యక్తిగత వివరాలను, సంభాషణలను వాట్సాప్‌ ఇతర దేశాల్లోని సర్వర్లలో స్టోర్‌ చేస్తుందన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ విషయమై ప్రపంచ దేశాలు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రష్యా కూడా వచ్చి చేరింది.

తాజాగా రష్యా వాట్సాప్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. రష్యాకు చెందిన యూజర్ల డేటాను అదే దేశంలో స్టోర్‌ చేయడంలో వాట్సాప్‌ విఫలమైందని శుక్రవారం ఆ దేశం వాట్సాప్‌పై చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. అయితే ఈ విషయంపై మాత్రం వాట్సాప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. గతంలోనూ రష్యా ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌పై జరిమాన విధించింది. గూగుల్‌ వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో రష్యా కోర్టుకు గూగుల్‌కు రూ. 30,50,440 జరిమాన విధించింది. అంతేకాకుండా ట్విట్టర్‌పై కూడా ఇదే కేసు నమోదు చేసింది రష్యా. సోషల్‌ మీడియా సైట్లు నిషేధిత కంటెంట్‌ను తొలగించడంతో పాటు రష్యాలో తమ ప్రాంతీయ ఆఫీసులను తెరవాలన్న దానిపై రష్యా కోర్టు ఈ సంస్థలపై నిత్యం జరిమాన విధిస్తూనే ఉంది. ప్రస్తుతం నమోదైన కేసు వల్ల వాట్సాప్‌ సుమారు రూ. 60 లక్షలు జరిమాన చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ ఫ్యాక్స్‌ మీడియా సంస్థ తెలిపింది. మరి ఈ విషయమై ఫేస్‌బుక్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Mi Power Bank: షియోమీ ఎంఐ హైపర్‌సోనిక్ పవర్ బ్యాంక్ .. ఫాస్ట్‌ 50w చార్జింగ్‌.. 20000 ఎంఏహెచ్‌ ధర ఎంతంటే..!

Sandes App: లోక్‌ సభలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన.. వాట్సాప్‌ తరహాలో ‘సందేశ్‌’ యాప్‌

Flower don’t die: వికసించిన పువ్వు ఎల్లకాలం అలానే.. అదే అందంతో ఉంటే..! ఇలా చేస్తే సరి.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu