Mi Power Bank: షియోమీ ఎంఐ హైపర్‌సోనిక్ పవర్ బ్యాంక్ .. ఫాస్ట్‌ 50w చార్జింగ్‌.. 20000 ఎంఏహెచ్‌ ధర ఎంతంటే..!

Mi Power Bank: మొబైల్‌ రంగంలో పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక షియోమీ..

Mi Power Bank: షియోమీ ఎంఐ హైపర్‌సోనిక్ పవర్ బ్యాంక్ .. ఫాస్ట్‌ 50w చార్జింగ్‌.. 20000 ఎంఏహెచ్‌ ధర ఎంతంటే..!
Mi Hypersonic Power Bank
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 7:56 AM

Mi Power Bank: మొబైల్‌ రంగంలో పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక షియోమీ మనదేశంలో దూసుకుపోతోంది. ఇక మొబైల్‌ వాడకంలో చార్జింగ్‌ అనేది ముఖ్యమైన విషయం. మొబైల్‌ చార్జింగ్‌ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. ఇక ఎక్కడికైనా వెళితే.. అక్కడ విద్యుత్‌ అంతరాయం, చార్జింగ్‌ పెట్టుకోవడానికి సమయం ఉండకపోవచ్చు. చార్జింగ్‌ పెడితే ఒకే చోటు ఉంచాల్సి ఉంటుంది. కానీ పవర్‌ బ్యాంక్‌ ఉంటే వెంట ఉంచుకునే చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలో స్పీడ్‌గా చార్జ్‌ చేసే పవర్‌ బ్యాంకులు కూడా వచ్చేశాయి.

ఇక తాజాగా షియోమీ కొత్త పవర్‌బ్యాంక్‌ను విడుదల చేసింది. 20000 ఎంఏహెచ్‌ సామర్థంగల ఎంఐ హైపర్‌ సోనిక్‌ పవర్‌ బ్యాంకు విడుదలైంది. ఇందులో హైపర్‌ ఫాస్ట్‌ 50w చార్జింగ్‌ సామర్థ్యం ఉంది. ఇందులోమూడు పోర్టులను కూడా అందించింది షియోమీ. యూఎస్‌బీఐ టైప్‌-సీ పోర్టు ద్వారా దీనిని చార్జ్‌ చేసుకోవచ్చు.

ధర ఎంతంటే..

షియోమీకి చెందిన పవర్‌బ్యాంకు ధర రూ.3,499గా నిర్ణయించారు. ఎంఐ.కాం వెబ్‌సైట్ ద్వారా ఈ పవర్‌ బ్యాంకును కొనుగోలు చేయవచ్చు. అయితే దీనికి సంబంధించి కేవలం 2,500 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నారు. 15 రోజుల పాటు మాత్రమే ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

ఎంఐ హైపర్‌సోనిక్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్లు

దీని ద్వారా ఒకేసారి ఎక్కువ డివైస్‌లకు చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం. ఇందులో మొత్తం మూడు పోర్టులు ఉన్నాయి. వీటిలో ఒకటి యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కాగా, మరో రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్టులు. ఈ పవర్ బ్యాంకు ద్వారా స్మార్ట్ ఫోన్లకు 50W వేగంతో చార్జింగ్ పెట్టవచ్చు. ఈ పోర్టుతో ఏకంగా ల్యాప్‌టాప్‌కు కూడా చార్జింగ్ పెట్టే అవకాశం ఉంది.

4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్‌కు ఈ పవర్ బ్యాంకు ద్వారా గంటా ఐదు నిమిషాల్లో పూర్తి చార్జింగ్ అయిపోతుంది. అలాగే ప్రీమియం మాట్ బ్లాక్ డిజైన్‌ను ఇందులో అందించారు. ఇందులో మూడు పోర్టులు ఉన్నప్పటికీ పట్టుకోవడానికి సౌకర్యంగా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. అంతేకాదండోయ్‌.. ఇందులో లో చార్జింగ్ మోడ్ కూడా ఉంది. దీని ద్వారా తక్కువ పవర్ అవుట్‌పుట్‌ను అందుకునే బ్లూటూత్ హెడ్‌సెట్లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లను చార్జ్ పెట్టుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Google: గూగుల్‌ సంచలన నిర్ణయం.. వారికి మాత్రం పెద్ద సమస్యగా మారే అవకాశం.. అలాంటి యాప్స్‌ పూర్తిగా తొలగింపు..!

Gold: బంగారానికి భారీగా పెరిగిన డిమాండ్‌.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జోరుగా పసిడి కొనుగోళ్లు.. ఎంతంటే..!