RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధింపు..!

RBI: ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం కారణంగా ..

Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 8:04 AM

RBI: ఈ మధ్య కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడం కారణంగా భారీ ఎత్తున జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులపై ఈ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది ఆర్బీఐ.

1 / 4
ఇక తాజాగా ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంకుకు భారీ షాకిచ్చింది. నిబంధనలు అతిక్రమించినందుకు గాను 5 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే యాక్సిస్ బ్యాంక్ ఆర్‌బీఐ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

2 / 4
ఆర్‌బీఐ ఆదేశాలు సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ కొరఢా ఝులిపించింది ఆర్బీఐ. స్పాన్సర్ బ్యాంకులు, ఎస్సీబీలు, యుసీబీల మధ్య చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడంపై ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని నిబంధనలను యాక్సిస్ బ్యాంక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో జరిమానా విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

3 / 4
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 46 (4) (ఐ), సెక్షన్ 47 ఎ (1) (సి) నిబంధనల కింద యాక్సిస్ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇకపోతే జరిమానా ఎందుకు విధించకూడదో కూడా తెలియజేయాలని ఆర్‌బీఐ యాక్సిస్ బ్యాంక్‌కు తెలిపింది. తర్వాత జరిమానా విధింపు నిర్ణయం అమలవుతుంది.

4 / 4
Follow us