Google: గూగుల్ సంచలన నిర్ణయం.. వారికి మాత్రం పెద్ద సమస్యగా మారే అవకాశం.. అలాంటి యాప్స్ పూర్తిగా తొలగింపు..!
Google: ఆండ్రాయిడ్ యాప్‌లనుక్రియేట్ చేసే డెవలపర్లకు గూగుల్ షాకిచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు లిస్టెడ్ యాప్‌లపై సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో..
Google: ఆండ్రాయిడ్ యాప్‌లనుక్రియేట్ చేసే డెవలపర్లకు గూగుల్ షాకిచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లో పలు లిస్టెడ్ యాప్‌లపై సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను, అలాగే చాలా రోజుల పాటు అప్‌డేట్ చేయకుండా ఉన్న యాప్‌లను పూర్తిగా తొలగించాలని గూగుల్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2021 సెప్టెంబర్ 1 నుంచి ఆయా యాప్స్ తొలగింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని గూగుల్ వెల్లడించింది.
ఇన్‌ఆక్టివ్‌గా ఉన్న యాప్‌లను తొలగించడంతో గూగుల్ ప్లే స్టోర్ క్లీన్ కావడమే కాకుండా ప్లే స్టోర్ భద్రత మరింత పటిష్టమైతుందని గూగుల్ పేర్కొంది. లోపాలు, బగ్‌లను కలిగివున్న యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్ యాక్టివ్‌గా వారి యాప్‌లను మెయిన్‌టెన్ చేస్తే గూగుల్ ప్లే వాటిని తొలగించదు. గూగుల్ స్టోర్‌లో యాక్టివ్‌గా ఉండి, సుమారు 1000కిపైగా ఇన్‌స్టాల్ కలిగి ఉన్న యాప్‌లు, లేదా గత 90 రోజుల్లో ఇన్ యాప్ పర్చెస్ కలిగివున్న యాప్‌లను తొలగించదని గూగుల్ పేర్కొంది.
కొత్త పాలసీ అప్‌డేట్ కింద యాప్‌లను తిరిగి పాత యాప్‌లను, డేటాను పునరుద్దరించలేరు. వాటి స్థానంలో కచ్చితంగా కొత్త వాటినే సృష్టించాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సర్వీస్ ఏపీఐ టూల్‌ను గూగుల్ జత చేయనుంది. ఇది యూజర్ డేటా, డివైజ్ ఫంక్షనాలిటీను యాక్సెస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో యూజర్లు సురక్షితంగా యాప్‌లను యాక్సెస్ చేయగలరు. తాజాగా గూగుల్ నిర్ణయంతో యాప్స్ డెవలపర్లకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.