AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Network: స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పోతో జతకట్టిన రిలయన్స్‌ జియో.. 5జీ నెట్‌ వర్క్‌ కోసం పరీక్షలు..!

 5G Network: దేశంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు 2జీ, 3జి,4జి ఉన్నటెక్నాలజీ.. 5జీ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు..

5G Network: స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పోతో జతకట్టిన రిలయన్స్‌ జియో.. 5జీ నెట్‌ వర్క్‌ కోసం పరీక్షలు..!
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 30, 2021 | 10:13 AM

Share

5G Network: దేశంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు 2జీ, 3జి,4జి ఉన్నటెక్నాలజీ.. 5జీ సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నెట్‌వర్క్‌ కంపెనీలు మొబైల్‌ తయారీ సంస్థలతో జట్టు కడుతున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ముంబయి, గుర్‌గ్రావ్‌ నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని ఒప్పో కంపెనీతో కలిసి పరీక్షించనుంది. ఇందుకోసం ఒప్పో కొత్తగా విడుదల చేసిన రెనో 6 సిరీస్‌ 5జీ ఫోన్లను ఉపయోగించనున్నారు. రెనో 6 ప్రో మోడల్‌ 11 రకాల 5జీ నెట్‌వర్క్‌లను, రెనో 6 మోడల్ 13 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన 5జీ పరీక్షలు నెట్‌వర్క్ రద్దీ కారణంగా సబ్‌-6గిగాహెర్జ్‌ సామర్థ్యంతో నిర్వహించారు. దీంతో పరీక్షల్లో 1జీబీపీఎస్ వేగాన్ని మాత్రమే అందుకునేవి. తాజాగా మొబైల్ కంపెనీలు వివిధ రకాల నెట్‌వర్క్ సామర్థ్యాలను సపోర్ట్ చేసే విధంగా ఫోన్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకువస్తుండటంతో నెట్‌వర్క్ కంపెనీలు వాటితో కలిసి 5జీ నెట్‌వర్క్‌లను పరీక్షించేందుకు మొగ్గుచూపుతున్నాయి.

అయితే రిలయన్స్‌ జియో తన 5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌ను ఒప్పో ఫోన్ల ద్వారా పరీక్షించాలనుకోవడం శుభపరిమాణమని, దేశంలో 5జీ నెట్‌వర్క్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కలయిక ఎంతగానో దోహదపడుతుంనది ఒప్పో కంపెనీ ఆర్‌అండ్‌డీ హెడ్‌ తస్లీమ్‌ ఆరిఫ్ పేర్కొన్నారు.

రియల్‌మీ వైర్‌లెస్ ఛార్జింగ్

కాగా, రియల్‌మీ కంపెనీ ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం మాగ్నటిక్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో తొలి డివైజ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఈ విషయమై రియల్‌మీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రియల్‌మీ మాగ్‌డార్ట్‌ పేరుతో కొత్త ఛార్జింగ్‌ టెక్నాలజీకి సంబంధించిన సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మాగ్‌ ఫర్ ఫ్యూచర్ పేరుతో గుండ్రని ఆకారంలో ఉన్న బొమ్మను ఆయన ట్వీట్ చేశారు. తర్వాత తరం ఆండ్రాయిడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కు సిద్ధంకండి. రియల్‌మీ మీకోసం మాగ్‌డార్ట్‌ని తీసుకొస్తుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇతర వైర్‌లెస్ ఛార్జింగ్ డివైజ్‌లతో పోలిస్తే మాగ్‌డార్ట్ 440 శాతం వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 3 తేదీన దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఛార్జింగ్‌ మొబైల్‌ ఫోన్లతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

Redmi Laptop: రెడ్‌మి నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్స్‌ వివరాలు.. విడుదల ఎప్పుడంటే..!

Smart Watch: ఇన్‌బేస్ కంపెనీ నుంచి కొత్త ‘అర్బన్ ప్లే స్మార్ట్‌వాచ్‌’..వర్షంలోనూ పనిచేస్తుంది..ఇంకా ఈ  వాచ్ స్పెషాలిటీస్ ఏమిటంటే..