Windows 11: మీ పీసీలో విండోస్ 11 పొందాలా.. అయితే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Windows11 Download: ఈ ఏడాది అక్టోబర్‌లో వినియోగదారుల కోసం విండోస్ 11 ను మైక్రోసాఫ్ట్ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే అంతకుముందే మీరు విండోస్ 11 వాడాలనుకుంటున్నారా? అయితే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం..!

Windows 11: మీ పీసీలో విండోస్ 11 పొందాలా.. అయితే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!
How To Download Windows 11
Follow us
Venkata Chari

|

Updated on: Jul 30, 2021 | 10:34 AM

Windows 11 Download: మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం రూపొందించిన అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఏడాది చివర్లో విండోస్ 10 వినియోగదారులకు ఉచిత అప్‌గ్రేడ్‌గా రానుంది. అయితే అప్పటి వరకు మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. విండోస్ 11 ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక మార్గం మీకోసం ఎదురుచూస్తోంది. దీంతో మీ పీసీ, ల్యాప్‌టాప్‌లో తాజా ఓఎస్‌ను హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఇది ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్‌గా అందుబాటులో ఉంది. దీనినే మీరు డౌన్‌లోడ్ చేసుకోని ఉపయోగించుకోవచ్చు. ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్‌.. విండోస్ 11 ను వినియోగదారులకు అందించేందుకు ముందు ఎలా ఉందో తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.

అయితే, విండోస్ 10 మెషీన్లలో విండోస్ 11 గా ఎప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చనే దానిపై మైక్రోసాఫ్ట్ ఖచ్చితమైన టైమ్‌లైన్ ప్రకటించలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల మేరకు అక్టోబర్ నాటికి ఇది విండోస్ 10 వినియోగదారుల చెంతకు తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. రోల్అవుట్ ప్రాసెస్‌ అయ్యాక ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మొదట్లో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో కొత్త విండోస్ వెర్షన్‌ను పొందగలుగుతారు.

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఇన్‌సైడర్ ప్రివ్యూను దాని అధికారిక విడుదల కంటే ముందే సరికొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పరీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తోంది. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

పీసీలో విండోస్ 11 ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.. మీ పీసీలో విండోస్ 11 ఇన్‌సైడర్ ప్రివ్యూను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో దశల వారీగా అందిస్తున్నాం. అయితే, అంతకంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్‌లు ప్రత్యేకంగా టెస్టింగ్ కోసం విడుదల చేస్తుంటారు. ఇందులో ఎర్రర్స్ (లోపాలు) కూడా ఉంటాయి. దీంతో మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ కొంత అసౌకర్యానాకి గురయ్యే అకవాశం కూడా ఉంది. గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన కొన్ని లక్షణాలు ఇన్‌సైడర్ నిర్మాణంలో ఉండకపోవచ్చు. ప్రారంభించడానికి ఇంకా ఆసక్తిగా ఉన్నారా? అయితే, మీరు ఈ స్టెప్స్‌ను ఫాలో చేయండి.

1. విండోస్ ఇన్‌సైడర్ ప్రోగ్రాంలో లాగినే చేసేందుకు సెట్టింగులు > అప్‌డేట్ & సెక్యూరిటీ > విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాం క్లిక్ చేసి లాగిన్ చేయాలి. అయితే ముందుగా సైన్ అప్ చేసి, ఆపై, రిజిస్టర్ బటన్ నొక్కండి. మీరు ఇప్పటికే విండోస్ ఇన్‌సైడర్ కమ్యూనిటీలో భాగమైతే, మీరు మీ అకౌంట్‌కి సైన్ ఇన్ చేయవచ్చు.

2. మీ స్క్రీన్‌లో కనిపించే ప్రైవసీ నిబంధనలు సమీక్షించి, క్లిక్ చేయండి.

3. విండోస్ ఇన్‌సైడర్ ప్రివ్యూ కోసం ఉద్దేశించిన ప్రస్తుత విండోస్ 11 బిల్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి ఇన్‌సైడర్ సెట్టింగులను మార్చాలి. అందులో డెవ్ ఛానెల్‌ని ఎంచుకుని, కన్ఫర్మ్ బటన్ నొక్కండి.

4. అనంతరం మైక్రోసాఫ్ట్ ఇన్‌సైడర్ ప్రైవసీ స్టేట్‌మెంట్, అగ్రిమెంట్ చూపిస్తుంది. ఇవి ఓసారి సమీక్షించిన తర్వాత ఓకే చేస్తూ బటన్ క్లిక్ చేయండి.

5. ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్ పొందడానికి మీ పీసీని రీస్టాట్ బటన్ నొక్కండి.

6. రీస్టాట్ తర్వాత, మీ ఇంటర్నెట్ కనెక్షన్‌కు యాక్టివ్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తరువాత సెట్టింగ్‌లు > అప్‌డేట్ & సెక్యూరిటీ > విండోస్ అప్‌డేట్‌కి వెళ్లాలి. అక్కడ చెక్ ఫర్ అప్‌డేట్స్ బటన్ క్లిక్ చేయండి.

7. దీంతో మీ పీసీ మైక్రోసాఫ్ట్ సర్వర్ నుంచి సరికొత్త విండోస్ 11ను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభిస్తుంది. డౌన్‌లోడ్ అయ్యాక ఓసారి మొత్తం చెక్ చేసుకుని విండోస్ 11ను ఎంజాయ్ చేయండి.

ముఖ్యంగా, విండోస్ 11 మీ పీసీలో కావాలంటే కొన్ని హార్డ్‌వేర్ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్ నుంచి వాటిని చెక్ చేసుకోవచ్చు. విండోస్ 11 ఇన్‌స్టా్ల్ చేసుకునేముందు ప్రస్తుత ఓఎస్‌ను బ్యాకప్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఇన్‌సైడర్ బిల్డ్‌లో ఏదైనా సమస్య వస్తే.. మరలా మీ పాత ఓఎస్‌కు మారిపోవచ్చు.

Also Read: Smart Phone: ఈ సరికొత్త ఫోన్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 5 రోజులు పనిచేస్తుంది..ధర ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే